శనివారం, 21 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 డిశెంబరు 2022 (15:45 IST)

బ్యాడ్ రికార్డ్: సొంతగడ్డపై పాక్ వైట్ వాష్

England
England
ఇంగ్లండ్‌ జట్టు పాక్‌ వేదికగా జరిగిన మూడు టెస్టుల్లోనూ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. చాలా సంవత్సరాల తర్వాత పాకిస్థాన్ ఒక టెస్ట్ మ్యాచ్ కోసం పర్యటించింది. ఇందులో మూడు మ్యాచ్‌లు గెలిచి చరిత్ర సృష్టించింది.
 
ప్రస్తుతం జరుగుతున్న మూడో మ్యాచ్‌లో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 304 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 216 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 354 పరుగులు చేసి జట్టుకు 167 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
 
ఈ దశలో ఇంగ్లండ్ జట్టు 2 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీని తర్వాత జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లోనూ ఇంగ్లండ్‌ జట్టు విజయం సాధించడం గమనార్హం. ఈ సిరీస్ ఓటమితో సొంతగడ్డపై పాక్ జట్టు తొలిసారి వైట్ వాష్ అయి బ్యాడ్ రికార్డ్ క్రియేట్ చేసింది.