గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 డిశెంబరు 2022 (16:45 IST)

ఇంగ్లండ్ జట్టు రికార్డు.. 22 సంవత్సరాల తర్వాత..?

England
England
ఇంగ్లండ్ జట్టు రికార్డు సృష్టించింది. పాకిస్థాన్ గడ్డపై 22 సంవత్సరాల తర్వాత తొలిసారి టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్ జట్టు సొంతం చేసుకుంది. ముల్తాన్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో 28 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. 
 
తద్వారా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి వుండగానే2-0 తేడాతో సిరీస్‌ను స్టోక్స్ సేన సొంతం చేసుకుంది. కాగా ఇంగ్లండ్ జట్టు చివరిసారిగా పాకిస్థాన్ గడ్డపై 2000లో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. 
 
355 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ చివరి వరకు పోరాడింది. అయితే లంచ్ విరామం తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. తద్వారా పాకిస్థాన్ 328 పరుగులకు ఆలౌటైంది. 
 
దీంతో నాలుగు రోజుల్లోనే ఇంగ్లండ్ మ్యాచ్‌ను ముగించింది. ఇక ఈ మ్యాచ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 108 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన ఇంగ్లండ్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.