సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 డిశెంబరు 2022 (22:38 IST)

సీతగా సాయిపల్లవి.. బాలీవుడ్‌ ఎంట్రీ ఖాయమా?

Saipallavi
బాలీవుడ్‌లోకి ఫిదా భామ సాయిపల్లవి ఎంట్రీ ఇవ్వనుంది. రణ్ బీర్ కపూర్ హీరోగా రామాయణం ఆధారంగా బాలీవుడ్‌లో ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కనిపించనున్నారు. 
 
రావణుడి పాత్రను హృతిక్ రోషన్ పోషించనున్నారు. తెలుగు వారైన మధు మంతెన నిర్మించే ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది మొదలు కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ పొడక్షన్స్ పనులు జరుగుతున్నాయి.
 
ఇందులో సీత పాత్రకు సాయిపల్లవిని సంప్రదించినట్లు సమాచారం. ఈ పాత్రకు గతంలో దీపికా పదుకునే, కరీనా కపూర్ పేర్లు వినిపించాయి. ప్రస్తుతం ఈ పాత్రకు సాయిపల్లవిని ఖరారు చేశారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి వుంది. కాగా దక్షిణాదిలో మెప్పించిన సాయిపల్లవి ప్రస్తుతం బాలీవుడ్‌లో అడుగుపెట్టనుంది.