శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 19 జూన్ 2017 (12:52 IST)

వ్యాన్ ఇంజిన్‌లో నాగుపాము.. పది అడుగుల పొడవు.. 5 కిలోల బరువు.. ఏం చేసిందంటే? (వీడియో)

మినీ వ్యాన్ ఇంజిన్‌లో నాగుపాము కనిపించింది. అంతే కారు ఓనర్‌తో పాటు అందరూ జడుసుకున్నారు. దాన్ని బయటకు తీసేందుకు ముగ్గురు చైనీస్ పోలీసులు ఎంతగానో శ్రమించారు. చివరికి దాన్ని తీసుకెళ్లి అడవుల్లో విడిచిపెట

మినీ వ్యాన్ ఇంజిన్‌లో నాగుపాము కనిపించింది. అంతే కారు ఓనర్‌తో పాటు అందరూ జడుసుకున్నారు. దాన్ని బయటకు తీసేందుకు ముగ్గురు చైనీస్ పోలీసులు ఎంతగానో శ్రమించారు. చివరికి దాన్ని తీసుకెళ్లి అడవుల్లో విడిచిపెట్టారు. వివరాల్లోకి వెళితే.. చైనాలోని యున్నన్ ప్రావిన్స్ ప్రాంతంలో పది అడుగుల పొడవుతో దాదాపు ఐదు కిలోల బరువుతో కూడిన ఓ కింగ్ కోబ్రా మినీ వ్యాన్ ఇంజిన్ భాగంలో దాక్కుంది.
 
జూన్ ఒకటో తేదీన జరిగిన మినీ వ్యాను ఇంజిన్‌లో దాక్కున్న పామును చూసి అందరూ జడుసుకున్నారు. దాన్ని బయటకు తీసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. పామును తల వద్ద గట్టిగా పట్టుకుని ముగ్గురు వ్యక్తులు ఆ పామును కారు ఇంజిన్ నుంచి బయటకు లాగారు. 
 
ఆపై గోనె సంచిలో దాన్ని బంధించాలనుకున్నారు. అయితే గోనెసంచిలోకి వెళ్ళినట్లు వెళ్ళిన ఆ నాగుపాము మళ్లీ బుసలు కొడుతూ బయటికి వచ్చింది. చివరికి దాన్ని అడవుల్లో వదిలిపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోను మీరూ చూడండి.