సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : గురువారం, 11 ఆగస్టు 2016 (15:57 IST)

పిల్లలు పుట్టలేదనీ భార్య చేతులు నరికేసిన భర్త.. ఎక్కడ?

పిల్లల్ని కనలేదని తన వంశానికి వారసుల్ని ఇవ్వలేదని ఓ రాక్షసుడు తన భార్య చేతులను అతిదారుణంగా నరికేశాడు. ఈ దారుణమైన ఘటన కెన్యాలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... జాక్లైన్

పిల్లల్ని కనలేదని తన వంశానికి వారసుల్ని ఇవ్వలేదని ఓ రాక్షసుడు తన భార్య చేతులను అతిదారుణంగా నరికేశాడు. ఈ దారుణమైన ఘటన కెన్యాలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... జాక్లైన్, స్టీఫెన్లకు ఎనిమిది సంవత్సరాల క్రితం పెళ్లైంది. కానీ ఇంత వరకు పిల్లలు పుట్టలేదు. దీంతో కొపోద్రిక్తుడైన స్టీఫెన్ కత్తి తీసుకొని జాక్లైన్ చేతుల‌ను న‌రికి, విషయం బ‌య‌ట‌కు పొక్కితే చంపేస్తాన‌ని బెదిరించి అక్క‌డ నుంచి ప‌రార‌య్యాడు. విషయం తెలుసుకున్న జాక్లైన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగప్రవేశం చేసి పరారీలో ఉన్న స్టీఫెన్‌ను అరెస్ట్ చేశారు. 
 
అయితే త‌మ‌కు పిల్ల‌లు క‌ల‌గ‌క‌పోవ‌డానికి కార‌ణం స్టీఫెన్‌లో ఉన్న లోప‌మేన‌ని.. జాక్లైన్‌లో ఎలాంటి లోపం లేద‌ని ఆస్ప‌త్రి వ‌ర్గాలు వెల్లడించాయి. ఈ వార్త సోష‌ల్ మీడియాకు పాక‌డంతో జాక్లైన్‌కు అన్ని వ‌ర్గాల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. జాక్లైన్‌ ట్రీట్‌మెంట్ ఖ‌ర్చును తామే భ‌రిస్తామ‌ని కొంద‌రు ముందుకు వ‌స్తుండ‌గా ఇంకొంద‌రూ ఆమెను ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకు వ‌స్తున్నారు. 
 
ఒక సంస్థ వారు ఆమెకు ఆర్థిక సాయంగా ఆమె ఇంటికి వెళ్ళి కొంత డబ్బును సహాయంగా అందించారు. ఈ ఘటనను కెన్యాకు చెందినా రాజకీయ ప్రముఖులు, సామాజిక వేత్తలు, మహిళా కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. అతడిని తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.