జనవరి 31 వరకు అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను భయపెడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని భారత్ మరోమారు పొడిగించింది. ప్రస్తుతం ఉన్న తాత్కాలిక నిషేధాన్ని వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగిస్తూ పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) ఉత్తర్వులు జారీ చేశారు.
నిజానికి ఈ నెల 15 నుంచి అంతర్జాతీయ ప్రయాణాలను పునరుద్ధరించాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. అయితే, దక్షిణాఫ్రికా, బోట్స్ వానాలలో ఒమిక్రాన్ అనే మరో కొత్త వేరియంట్ పురుడు పోసుకోవడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. తాజాగా నిషేధాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.