ఇస్రోకు దెబ్బ.. బిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాల్సిందేనా? మన్మోహన్ సర్కారే కారణమా?
అంతరిక్షంలోకి పలు అత్యాధునిక శాటిలైట్లను ప్రయోగిస్తూ.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాల సరసన చేరిపోయిన ఇస్రోకు కొత్త తలనొప్పి వచ్చిపడింది. అంతర్జాతీయ ఇన్వెస్టర్ నుంచి శాటిలైట్ ఒప్పందాన్ని రద్దుచేసుకున్న క
అంతరిక్షంలోకి పలు అత్యాధునిక శాటిలైట్లను ప్రయోగిస్తూ.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాల సరసన చేరిపోయిన ఇస్రోకు కొత్త తలనొప్పి వచ్చిపడింది. అంతర్జాతీయ ఇన్వెస్టర్ నుంచి శాటిలైట్ ఒప్పందాన్ని రద్దుచేసుకున్న కేసులో భారత్కు చుక్కెదురైంది. ఈ కేసుపై విచారించిన అంతర్జాతీయ ట్రైబ్యునల్ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు నివ్వడం ద్వారా భారత్ బిలియన్ డాలర్ల మేర నష్ట పరిహారం చెల్లించాల్సి వుంటుంది.
కాగా ఇస్రో ప్రధాన కార్యాలయంగా పనిచేసే స్పేస్ కంపెనీ ఆంట్రిక్స్ ఈ మేరకు రెండు ఉపగ్రహాలు, ఎస్ బ్యాండ్ స్పెక్ట్రమ్ కొనేందుకు దీవాస్ మల్టీమీడియా సంస్థతో ఒప్పందం చేసుకుంది. అయితే 2005లో ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో దీవాస్ సంస్థ భారీగా నష్టపోయింది.
ఇస్రో ఛైర్మన్ మాధవన్ నాయర్ నాయకత్వంలో ఈ ఒప్పందంపై దీవాస్ సంతకాలు చేసిందని, ఆంట్రీక్స్ దాదాపు 12 ఏళ్లకు రూ.600 కోట్లు చెల్లించిందని విచారణలో తెలియవచ్చింది. దీంతో 2015లో ఆంట్రిక్స్పై అంతర్జాతీయ ట్రైబ్యునల్లో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను స్వీకరించిన న్యాయస్థానం.. భారత ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేసుకోవడాన్ని తప్పుబడుతూ జరిగిన నష్టానికి బిలియన్ డాలర్లు చెల్లించాలని తీర్పునిచ్చింది.
కానీ గత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మాత్రం ఈ ఒప్పందం కుదరలేదని, ఇస్రో శాటిలైట్లను అప్పటికే రూపొందించే పనుల్లో ఉందని చెప్తోంది. అయితే 2జీ స్కామ్ వెలుగులోకి రావడంతో ఈ ఒప్పందం మూలన పడిందని వార్తలొస్తున్నాయి.