గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 25 డిశెంబరు 2018 (17:46 IST)

ఇండోనేషియాలో సునామీ.. తాగడానికి నీరు కూడా లేదు.. 429కి చేరిన మృతుల సంఖ్య..

ఇండోనేషియాలో సునామీ బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. సముద్రంలో, తీరానికి దగ్గరగా ఉన్న ఒక అగ్నిపర్వతం పేలిన కారణంగా ఇండోనేసియాలో సునామీ సంభవించిన సంగతి విదితమే. సుమత్రా, జావా ద్వీపాల మధ్యనున్న సుండా జలసంధిలోని చిన్న దీవిలో వున్న అనక్ క్రకటోవా అనే అగ్నిపర్వతం పేలిన కారణంగా శనివారం సునామీ సంభవించింది. 
 
ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 429కి చేరుకుంది. మరో 154 మంది గల్లంతయ్యారని ఇండోనేషియా డిజాస్టర్ ఏజెన్సీ అధికారులు ప్రకటించారు. వారి కోసం శిథిలాల కింద సహాయక సిబ్బంది వెతుకుతున్నారు. వందలాది భవనాలు నేలమట్టం కావడంతో సురక్షిత నివాసాల కోసం పడిగాపులు కాస్తున్నారు. 
 
తాగడానికి కనీసం మంచినీరు కూడా లేకపోవడంతో బాధిత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామంది చిన్నపిల్లలు జ్వరంతో బాధపడుతున్నారు. ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా 16వేలకు మించిన ప్రజలు నిరాశ్రయులైయ్యారు.