డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ప్రేమికుడు.. ఇలా చేశాడు..
డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ప్రేమికుడి చేతిలో ఓ ప్రేయసి మోసపోయింది. ప్రస్తుతం ట్రెండింగ్‌లో వున్న ఓ డేటింగ్ యాప్ ద్వారా.. మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకునే వెసులుబాటు వుంది. అయితే ఇలాంటి యాప్‌ల ద్వారా నేరాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. తాజాగా ఇలాంటి మోసమే ఇండోనేషియాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియాలోని టిబాక్ ప్రాంకంలో ఓ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన 39 ఏళ్ల ప్రేమికుడు ఆందికా తన 41 ఏళ్ల ప్రేయసి వాక్స్ కారును దొంగలించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. గత వారం వీరిద్దరూ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమై చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. గతవారం ఓ మాల్‌కు వెళ్లారు. అక్కడ వాక్స్ షాపింగ్ చేస్తుండగా, ఆమె కారును ఆందికా దొంగలించుకుని పారిపోయాడు.
దీనిపై వాక్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపారు. విచారణలో ఆందికా పక్కా ప్లాన్ ప్రకారమే కారును దొంగలించాడని తేలింది. అంతేగాకుండా అతడు తరచూ కార్లను దొంగలించేవాడని పోలీసులు కనుగొన్నారు. దీంతో పరిచయం లేని వ్యక్తులతో సంబంధాలు పెట్టుకునే వారు.. ఇకపై జాగ్రత్త పడాలని పోలీసులు హెచ్చరించారు.