గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : మంగళవారం, 27 నవంబరు 2018 (15:45 IST)

బద్దం బాల్‌రెడ్డికి 73.. షహజాదీ బేగంకు 26.. అభ్యర్థుల వయసెంత?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు 26 యేళ్ళ నుంచి 73 యేళ్ళ వరకు ఉన్నారు. వీరిలో అందరికంటే పెద్ద బద్దం బాల్‌రెడ్డి కాగా, అందరికంటే చిన్నవారు షహజాదీ బేగం. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులతో చిన్నవయసువారు పోటీపడుతుండటంతో పోటీ రసవత్తరంగా మారింది. కొన్ని చోట్ల పోటి నువ్వానేనా అన్నట్టుగా సాగుతోంది. అయితే, ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న చిన్న వయసువారిని అంటే 40 యేళ్ళలోపు వారెవరో తెలుసుకుందాం. 
 
చాంద్రాయణగుట్ట నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షహజాదీ బేగం అతి చిన్న వయస్కురాలు (26). ఈమె అక్బరుద్దీన్ వంటి రాజకీయ ఉద్దండుడితో తలపడుతోంది. అలాగే రాజేంద్ర నగర్ నుంచి పోటీ చేస్తున్న మీర్జా రహమత్ బేగ్ (31), గోషా మహల్‌లో బీఎల్ఎఫ్ నుంచి పోటీ చేస్తున్న ట్రాన్స్‌జెండర్ చంద్రముఖి (32), ఉప్పల్‌లో మహాకూటమి తరపున పోటీ చేస్తున్న వీరేందర్ గౌడ్ (35), ముషీరాబాద్‍లో కూటమి తరపున పోటీ చేసే అనిల్ కుమార్ యాదవ్ (36), జూబ్లీహిల్స్ స్థానం నుంచి పోటీకి దిగుతున్న పి.విష్ణువర్థన్ రెడ్డి (36), కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేసే కాసాని వీరేశం (37), కంటోన్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసే శ్రీగణేశ్ (40), మలక్ పేట నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తునన ఆలె జితేంద్ర (40), యాకుత్పురా నుంచి తెరాస అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న సామ సుందర్ రెడ్డి (40), అంబర్ పేట నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసే రాజ్‌పాల్ (38) యేళ్ళ వయసు. 
 
అలాగే, 60 యేళ్ళ పైబడినవారి వివరాలను పరిశీలిస్తే, అంబర్ పేట మహాకూటమి తరపున పోటీ చేసే ఆర్ లక్ష్మణ్ యాదవ్ (61), ముషీరాబాద్ నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగిన డాక్టర్ కె లక్ష్మణ్ (62), మలక్ పేట నుంచి మహాకూటమి తరపున పోటీ చేసే ముజఫర్ అలీ ఖాన్ (63), కంటోన్మెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న జి సాయన్న (63-తెరాస), సర్వే సత్యనారాయణ (64-కాంగ్రెస్), ఖైరతాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి చింతల రాంచంద్రారెడ్డి (64), యాకుత్పురా నుంచి బరిలో ఉన్న ఎంఐఎం అభ్యర్థి పాషాఖాద్రి (64), ముషీరాబాద్ నుంచి పోటీ చేస్తున్న తెరాస అభ్యర్థి ముఠా గోపాల్ (66), మలక్ పేట తెరాస అభ్యర్థి చవ్వ సతీష్ కుమార్ (67), చార్మినార్ ఎంఐఎం అభ్యర్థి ముంతాజ్ ఖాన్ (70), రాజేంద్ర నగర్ బీజేపీ అభ్యర్థి బద్దం బాల్‌రెడ్డికి 73 యేళ్ల వయసు కలిగివున్నారు.