Biodata Maker
✕

అంతరిక్షంలో 16 Psyche అనే గ్రహశకలం.. దాని నిండా బంగారం, వజ్రవైఢూర్యాలు (Video)

Written By సెల్వి
Updated: గురువారం, 20 ఆగస్టు 2020 (18:26 IST)
NASA Psyche Mission
ప్రపంచంలో వున్న అందరూ లక్షాధికారులు అయ్యేంత బంగారం, వజ్రాలు ఆనవాళ్లు గల గ్రహశకలం దొరికింది. వీటిని తవ్వేందుకు ప్రపంచ దేశాలు సిద్ధమవుతున్నాయి. అంతరిక్షంలో 16 సైకీ (16 Psyche) అనే గ్రహశకలంను నాసా కనుగొన్నారు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరినీ లక్షాధికారిగా మార్చడానికి బంగారం, విలువైన వజ్రాలు ఇక్కడ పోగు చేయబడిందని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనిపై సత్వర అధ్యయనం జరుగుతోంది. 1952లో కనుగొనబడిన 16సైకీలో $10,000 quadtrillionల విలువ చేసే బంగారం, వజ్ర వైఢూర్యాలున్నట్లు నాసా తెలిపింది. 
 
ఈ ఉల్కా 226 కిలోమీటర్ల దూరాన్ని కలిగి ఉంది. ఇది మార్స్, బృహస్పతి గ్రహాల మధ్య ఉంది. వాల్ స్ట్రీట్ పరిశోధనా సంస్థ బెర్న్‌స్టెయిన్ ఇప్పటికే ఈ ఉల్కాలో 17 బిలియన్ టన్నుల నికెల్, ఇనుప ఖనిజం మానవ అవసరాలను తీర్చడానికి బిలియన్ల సంవత్సరాలు పాటు ఉందని అంచనా వేసింది. అలాగే 2022లో 16 సైకీ గ్రహశకలంకు అంతరిక్ష నౌకను పంపాలని నాసా నిర్ణయించింది. మూడున్నర సంవత్సరాలు ప్రయాణించిన తరువాత, అంతరిక్ష నౌక 2026లో కక్ష్యకు చేరుకుంటుంది. ఈ వ్యోమనౌక సైకీని సుమారు 21 నెలలు కక్ష్యలో ఉంచుతుంది.
 
నాసా 16సైకీని అన్వేషించడానికి 'సైకీ స్పేస్‌క్రాఫ్ట్' అనే అంతరిక్ష నౌకను నిర్మిస్తోంది. ఈ వ్యోమనౌక ఇటీవల ఒక ముఖ్యమైన డిజైన్ దశకు చేరుకుందని చెబుతున్నారు. అరిజోనా స్టేట్ యూనివర్శిటీ సహాయంతో నాసా యొక్క జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ ఈ వ్యోమనౌకను నిర్మించింది. రాళ్లు, మట్టికి మించిన లోహాలను అన్వేషించడానికి నాసా అంతరిక్ష నౌకను పంపడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 

 

అన్నీ చూడండి

స్టేజిపై హీరోయిన్‌కు ముద్దు పెడతానంటూ దగ్గరకు లాక్కున్న హీరో, అంత బలుపా అంటూ ట్రోల్స్

మూస చిత్రాలకు భిన్నంగా రాజిగాడు రాజయ్యాడు, టీజర్ లాంఛ్

Keerthy Suresh, Krithi Shetty : దళపతి సీన్ రీక్రియేషన్‌తో ప్రమోషన్స్ ప్రారంభించిన జనవరి 12 విడుదల

Prabhas Update: సన్నబడిన ప్రభాస్ లుక్‌పై అభిమానుల చర్చ - అమ్మవారిని దర్శించుకున్న ప్రభాస్

RAPO23 Update: తోడేలు భావాలున్న వ్యక్తి కథ గా రామ్ పోతినేని రాపో23 చిత్రం

తర్వాతి కథనం
Show comments