ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (07:07 IST)

అంతరిక్ష పోటీలో భారత్ కొత్త ప్రమాణం నెలకొల్పినట్లే: ఎట్టకేలకు చైనా ఒప్పుకోలు

ఏకకాలంలో 104 ఉపగ్రహాలను ప్రయోగించి రికార్డు సృష్టించిన భారత్ అంతరిక్ష పోటీలో కొత్త ప్రమాణం నెలకొల్పిందని ఎట్టకేలకు చైనా మీడియా అంగీకరించింది. పైగా ఇండియా సాధించిన విజయం తమ దేశ వాణిజ్య అంతరిక్ష పరిశ్రమకు మేలుకొలుపు లాంటిదని కూడా వ్యాఖ్యానించింది.

ఏకకాలంలో 104 ఉపగ్రహాలను ప్రయోగించి రికార్డు సృష్టించిన భారత్ అంతరిక్ష పోటీలో కొత్త ప్రమాణం నెలకొల్పిందని ఎట్టకేలకు చైనా మీడియా అంగీకరించింది. పైగా ఇండియా సాధించిన విజయం తమ దేశ వాణిజ్య అంతరిక్ష పరిశ్రమకు మేలుకొలుపు లాంటిదని కూడా వ్యాఖ్యానించింది. భారత్ తాజా విజయం తర్వాత చైనా తన రాకెట్ ప్రయోగాల వాణిజ్యీకరణను వేగవంతం చేయాల్సిన అవసరముంది. అంతరిక్ష పోటీని పెంచిన భారత ఉపగ్రహ ప్రయోగం పేరిట చైనా అధికారులు ప్రభుత్వానికి  పంపిన నివేదికను చైనా మీడియా ప్రస్తావించింది. 
 
అంతర్జాతీయంగా ఉపగ్రహ సేవలను ప్రమోట్ చేయడంలో చైనా కంటే భారత్ ఎెంతో ముందంజలో ఉందని షాంఘై ఇంజనీరింగ్ సెంటర్ ఫర్ మైక్రోశాటిలైట్స్ సాంకేతిక విభాగం డైరెక్టర్ జాంగ్ యీంగీ ప్రశంసించినట్లు ఈ నివేదిక తెలిపింది.వాణిజ్య ఉపగ్రహాలను అంతరిక్షంలోకి అత్యంత తక్కువ వ్యయంతో భారత్ పంపించగలదని దాని తాజా ఉపగ్రహ ప్రయోగంతో ధ్రువపడిందని యాంగీ పేర్కొన్నారు. ఉరకలెత్తుతున్న అంతరిక్ష వాణి్జ్యానికి సంబంధించిన గ్లోబల్ పోటీలో భారత్ సామర్థ్యాన్ని తాజా ప్రయోగం స్పష్టం చేసిందన్నారు.
 
చైనా కంటే ముందుగా అంగారకగ్రహం మీదికి ఉపగ్రహాన్ని పంపిన భారత్ ఇప్పుడు సింగిల్ రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను పంపించి మంచి అవకాశాన్ని సాధించిందని జాంగ్ తెలిపారు. భారత్ గత బుధవారం సాధించిన ప్రయోగం అంతరిక్ష కార్యక్రమాల్లో దాని తాజా విజయంగానే చెప్పాలని అంగీకరించారు. 2012లో అంగారక గ్రహ యాత్ర విషయంలో ఘోరంగా విఫలమైన చైనా వెనుకబడిపోగా, 2014లో అంగారక గ్రహంపైకి ఉపగ్రహ వాహకనౌకను దిగ్విజయంగా పంపిన భారత్ ఆ ఘనత సాధించిన నాలుగో దేశంగా చరిత్రకెక్కింది.