చరిత్రలోనే తొలిసారి ఆప్ఘన్ మంత్రితో జైశంకర్ చర్చలు
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. చరిత్రలోనే తొలిసారి ఆప్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వంలో తాత్కాలిక విదేశాంగ మంత్రిగా ఉన్న అమిర్ ఖాన్ ముత్తాఖీతో పహల్గాం ఉగ్రదాడిని తాలిబన్ ఖండించడాన్ని జైశంకర్ స్వాగతించారు. తాలిబన్లతో తాను మాట్లాడిన విషయాన్ని మంత్రి జైశంకర్ తన ఎక్స్ వేదికగా స్పందించారు. కాగా, తాలిబన్ ప్రభుత్వంతో న్యూఢిల్లీ మంత్రిత్వస్థాయిలో చర్చలు జరగడం ఇదే తొలిసారి.
'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది' - టర్కీ కంపెనీలకు భారత్‌లో షాకులపై షాక్!!
'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది' అన్న చందంగా మారింది టర్కీ దేశానికి చెందిన కంపెనీల పరిస్థితి. పహల్గాం దాడి తర్వాత భారత్‌కు వ్యతిరేకంగా నడుచుకున్న టర్కీ పాలకులు.. పాకిస్థాన్‌కు పూర్తి మద్దతు ప్రకటించడంతో పాటు భారత్‌పై దాడి చేసేందుకు వీలుగా శత్రుదేశం పాకిస్థాన్‌కు డ్రోన్లు, ఇతర సైనిక పరికరాలు, సైనికులను పంపించింది. ఈ చర్యలు భారత్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి.
ఫలితంగా టర్కీపై కేంద్ర ప్రభుత్వంతో పాటు భారత్‌కు చెందిన అనేక కంపెనీలు ప్రతీకార చర్యలకు శ్రీకారం చుట్టాయి. ఇందులోభాగంగా, భారత్‌లో వివిధ రకాలైన సేవలు అందిస్తున్న టర్కీ కంపెనీలతో ఉన్న ఒప్పందాలను రద్దు చేస్తున్నాయి. తాజాగా టర్కీ సంస్థ డ్రాగన్ పాస్‌తో ఉన్న ఒప్పందాన్ని అదానీ ఎయిర్‌పోర్ట్స్ రద్దు చేసింది. అలాగే, అదానీ విమానాశ్రయ లాంజ్లలో డ్రాగన్ పాస్ కస్టమర్లకు ప్రవేశం నిలిపివేసింది. టర్కీ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థ సెలెబీకి భద్రతా అనుమతులను కేంద్ర రద్దు చేసింది. జాతీయ భద్రత దృష్ట్యానే ఈ చర్యలు తీసుకున్నట్టు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
పహల్గాం ఉగ్రదాడులు, వాటికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్ టర్కీకి బాహాటంగా మద్దతు ప్రకటించడమే ఈ పరిణామాలకు కారణంగా తెలుస్తోంది. ప్రముఖ వ్యాపార సంస్థ అదానీ ఎయిర్‌పోర్టు హోల్డింగ్స్ ఓ టర్కీ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోగా, కేంద్ర ప్రభుత్వం మరో టర్కీ సంస్థకు ఇచ్చిన భద్రతా అనుమతులను ఉపసంహరించుకుంది.
విమానాశ్రయ లాంజ్‌ల సేవలకు సంబంధించి టర్కీకి చెందిన డ్రాగన్ పాస్ అనే సంస్థతో ఉన్న ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్టు అదానీ ఎయిర్‌పోర్టు హోల్డింగ్ లిమిటెడ్ (ఏఏహెచ్ఎల్) గురువారం ప్రకటించింది. డ్రాగన్ పాస్‌తో మా ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చేలా రద్దు చేయబడింది. అదానీ యాజమాన్యంలోని విమానాశ్రయాల్లోని లాంజ్‌లలోకి డ్రాగన్ పాస్ కస్టమర్లకు ఇకపై ప్రవేశం ఉండదు. అయితే, ఈ మార్పు వల్ల ఇతర ప్రయాణికుల లాంజ్‌ల అనుభవాలపై ఎలాంటి ప్రభావం ఉండదు అని ఏఏహెచ్ఎల్ ప్రతినిధి స్పష్టం చేసింది.
మరోవైపు, టర్కీకి చెందిన గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థ సెలెబీ ఎయిర్‌పోర్టు సర్వీసెస్‌కు భారత విమానాశ్రయాల్లో మంజూరు చేసిన భద్రతా అనుమతులను కూడా కేంద్ర పౌర విమానాయాన మంత్విత్వ శాఖ రద్దు చేసింది. "జాతీయ భద్రత దృష్ట్యా డైరెక్టర్ జనరల్, బీసీఏఎస్‌కు దఖలుపడిన అధికారాల మేరకు సెలెబీ ఎయిర్‌పోర్టు సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇచ్చిన భ ద్రతా అనుమతులను తక్షణమే రద్దు చేస్తున్నాం" అని పేర్కొంది.