బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 జూన్ 2022 (16:30 IST)

చిల్లి చికెన్ వండలేదని భార్యను కొడవలితో నరికి చంపేశాడు.. ఎక్కడ?

chilli chicken
క్షణికావేశాలతో నేరాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా చిల్లి చికెన్ వండలేదని భార్యను ఓ కిరాతక భర్త కడతేర్చిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దావణగెరె జిల్లా హరిహర ప్రాంతంలో కెంచప్ప, షీలా దంపతులు నివాసం వుంటున్నారు.
 
8 ఏళ్ల క్రితం ప్రేమించి వీరు పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమార్తె వుంది. ఇటీవల భార్యపై అనుమాంతో కెంచప్ప భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. అయితే ప్రస్తుతం పుట్టింటి దగ్గర ఉంటున్న షీలా.. బుధవారం రాత్రి కూతురు పుట్టిన రోజు సందర్భంగా తన భర్త వద్దకు వచ్చింది. 
 
ఈ క్రమంలో తాగి వున్న కెంచప్ప చికెన్ కూర (చిల్లి చికెన్) వండాలని భార్యకు భర్త చెప్పాడు. అయితే ఆమె వండలేదు. దీంతో గొడవ జరిగింది. మద్యం మత్తులో వున్న కెంచప్ప.. కొడవలితో భార్యను దారుణంగా నరికి చంపాడు. మత్తు దిగిన తర్వాత పోలీసుల ముందు లొంగిపోయాడు. 
 
దీంతో పోలీసులు కెంచప్పను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.