ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : బుధవారం, 29 నవంబరు 2017 (13:16 IST)

ఎస్... అమెరికాలో ఎక్కడైనా బాంబు వేయగలం... కిమ్: ఉలిక్కిపడిన అమెరికా, జపాన్

పిచ్చివాడి చేతిలో రాయి వుంటే ఏమవుతుంది. ఆ రాయి ఎప్పుడు ఎవరి మీద విసిరివేస్తాడోనన్న భయంతో అంతా బిక్కుబిక్కుమంటారు. ఇప్పుడు ఉత్తర కొరియా పరిస్థితి దాదాపు అలాగే తయారవుతోంది. ఒకవైపు దేశంలో ప్రజలు ఆర్థికంగ

పిచ్చివాడి చేతిలో రాయి వుంటే ఏమవుతుంది. ఆ రాయి ఎప్పుడు ఎవరి మీద విసిరివేస్తాడోనన్న భయంతో అంతా బిక్కుబిక్కుమంటారు. ఇప్పుడు ఉత్తర కొరియా పరిస్థితి దాదాపు అలాగే తయారవుతోంది. ఒకవైపు దేశంలో ప్రజలు ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటూ తినేందుకు తిండి లేక నానా ఇబ్బందులు పడుతుంటే ఉత్తర కొరియా చీఫ్ కిమ్ మాత్రం 15 రోజులకో బాంబు అన్నట్లుగా వున్న డబ్బంతా ఊడ్చేస్తున్నారు. బుధవారం తెల్లవారు జామున మరో శక్తివంతమైన క్షిపణి ప్రయోగం చేసి అమెరికా, జపాన్ దేశాలను ఉలిక్కిపడేలా చేశాడు.
రెండు నెలలపాటు మన్ను తిన్న పాములా వున్న కిమ్ దానికి చెక్ చెప్పేసి మరోసారి తన 'క్షిపణి' రూపాన్ని చూపించాడు. అత్యంత శక్తిమంతమైన ఐసీబీఎం ప్రయోగం చేసి అందరినీ ఆందోళనకు గురి చేశాడు. కాగా ఈ క్షిపణి జపాన్ ఎకనమిక్ జోన్‌లో పడింది. కిమ్ పనుల పట్ల తాము ఎంతో అప్రమత్తంగా ఉన్నామని అమెరికా వెల్లడించింది. 
 
నార్త్ కొరియా ప్రయోగించిన ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ (ఐసీబీఎం) జపాన్ స్పెషల్ ఎకనమిక్ జోన్ సమీపంలో పడటంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. క్షిపణి ప్రయోగంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ... తాము అప్రమత్తంగా ఉన్నామని చెప్పగా మిసైల్ టెస్ట్‌తో ప్రపంచం మొత్తానికి ముప్పు పొంచి ఉందని అమెరికా రక్షణ కార్యదర్శి మాటిస్ అన్నారు.