శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 6 అక్టోబరు 2017 (09:14 IST)

అమ్మనాన్నలను చూసి రమ్మని పంపాడు.. ఆయన చాలా మంచోడు...

అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలో నరమేధానికి పాల్పడిన స్టీఫెన్ పడ్డాక్ చాలా మంచోడు అని ఆయన ప్రియురాలు మారిలో డాన్లీ చెపుతోంది. ఇటీవల లాస్ వెగాస్‌లోని మాండలే బే వద్ద పడ్డాక్ మారణహోమం సృష్టించిన విషయం తెల్

అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలో నరమేధానికి పాల్పడిన స్టీఫెన్ పడ్డాక్ చాలా మంచోడు అని ఆయన ప్రియురాలు మారిలో డాన్లీ చెపుతోంది. ఇటీవల లాస్ వెగాస్‌లోని మాండలే బే వద్ద పడ్డాక్ మారణహోమం సృష్టించిన విషయం తెల్సిందే. 
 
ఈ దారుణ మారణకాండకు పాల్పడిన స్టీఫెన్ పడ్డాక్ గురించిన వివరాల సేకరణలో ఎఫ్బీఐ అధికారులు బిజీగా ఉన్నారు. పడ్డాక్ ప్రియురాలు మారిలో డాన్లీను ఫిలిప్పీన్స్ నుంచి రప్పించిన ఎఫ్బీఐ అధికారులు, ఆమెను విచారిస్తున్నారు. అయితే ఆమె స్టీఫెన్ పడ్డాక్ చాలా మంచి వ్యక్తి అని చెబుతోంది. అంతకంటే ప్రేమించే హృదయం కలిగిన మనిషిని తెలిపింది.
 
తనను చాలా బాగా చూసుకునేవాడని, అందుకే జీవితాంతం అతనితోనే ఉండాలని నిర్ణయించుకున్నానని ఆమె చెప్పింది. అయితే ఈ దారుణానికి పడ్డాక్ పాల్పడ్డాడంటే నమ్మబుద్ధి కావడం లేదని ఆమె చెప్పింది. విమానం టికెట్ చౌకగా వచ్చింది, వెళ్లి మీ తల్లిదండ్రులను చూసిరా అంటే ఫిలిప్పీన్స్ వెళ్లానని ఆమె చెప్పింది. ఫిలిప్పీన్స్‌లో ఇల్లు కొనేందుకు డబ్బులు కూడా పంపాడని ఆమె తెలిపింది. అంతకు మించి తనకు తెలియదని ఆమె తెలిపింది.