శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 24 జనవరి 2019 (17:05 IST)

సూర్యుడు ప్రతాపానికి 100 గుర్రాలు మృతి... ఎక్కడ?

సూర్యుడు ప్రతాపానికి ఏకంగా వంద గుర్రాలు ఒకేచోట ప్రాణాలు విడిచాయి. ఈ విషాదకర సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా దేశంలో గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. దీనికితోడు నీళ్ల కరవు ఏర్పడింది. ఒకవైపు ఎండలు, మరోవైపు దాహం.. ఈ రెండింటి బాధను తట్టుకోలేక మూగజీవులు ప్రాణాలు విడుస్తున్నాయి. 
 
దీనిపై ఆస్ట్రేలియా అధికారులు స్పందిస్తూ, ఎండ తీవ్రతకు ఆస్ట్రేలియాలో ఉన్న ఎలీస్ ఊట చెరువులు ఎండిపోయాయని.. దీంతో అక్కడి జంతువులు చనిపోయాయని చెప్పారు. కుప్పలు తెప్పలుగా చనిపోయిన జంతువులను.. ఒకే దగ్గర ఖననం చేస్తున్నామని వెల్లడించారు. ఆస్ట్రేలియా ప్రజలు 30 డిగ్రీల ఎండను తట్టుకోలేరు. అప్పటికే ఎక్కువగా ఈత కొలనుల్లో గడుపుతుంటారు. 
 
అయితే, ఇపుడు అక్కడ పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 46 డిగ్రీలకు చేరింది. దీంతో ఆ దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు ఎండధాటికి విలవిలలాడుతున్నారు. బయట తిరగడానికి భయపడుతున్నారు. ఎండ తీవ్రతకు రోడ్లుపై వేసిన తారు కరిగిపోతుండటంతో రోడ్లపై ప్రయాణం చేయవద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది.