1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2016 (13:35 IST)

అంతరిక్షం నుంచి లక్షలాది టన్నుల మీథేన్ లీకేజ్.. తొలిసారిగా గుర్తించిన నాసా!

​అంతరిక్షం నుంచి లక్షలాది టన్నుల మీథేన్ లీకైనట్లు నాసా తొలిసారిగా గుర్తించింది. అంతరిక్షం నుంచి ప్రమాదకర మీథేన్ వాయువు లీక్ అవుతున్నట్లు నాసా పేర్కొంది.

​అంతరిక్షం నుంచి లక్షలాది టన్నుల మీథేన్ లీకైనట్లు నాసా తొలిసారిగా గుర్తించింది. అంతరిక్షం నుంచి ప్రమాదకర మీథేన్ వాయువు లీక్ అవుతున్నట్లు నాసా పేర్కొంది. ఎర్త్ అబ్జర్వింగ్-1 శాటిలైట్‌తో పాటు నాసా పంపిన హైపరియన్ స్పెక్టోమీటర్ అనే పరికరం ద్వారా ఈ విషయం వెల్లడైనట్లు నాసా తెలిపింది. 
 
పర్యావరణ అంశంలో హరిత వాయువులను పర్యవేక్షించడం కోసం హైపరియన్ స్పెక్ట్రోమీటర్ అనే ఈ పరికరం ఉపయోగపడుతుంది. తాజాగా నాసా విడుదల చేసిన మీథేన్.. ఐదు లక్షల కార్లు ఏడాది పాటు విడుదల చేసే కాలుష్యానికి సమానమని నాసా అధికారులు తెలిపారు. 
 
అంతరిక్షం నుంచి విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువుల ప్రభావం భూగ్రహంపై ఏ మేరకు ఉండనుందనే విషయమై ఓ అవగాహనకు వచ్చేందుకు ఈ పరిశీలనను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. వాతావరణ మార్పుతో పాటు.. మీథేన్ లీకేజీ కారణంగా ఏర్పడే దుష్ప్రభావాలపై నాసా పరిశోధనలు మొదలెట్టింది. మీథేన్‌లో ప్రమాదకర టాక్సిక్ డియోక్సైడ్ ఎమిషన్స్ ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.