మేం యుద్ధం చేయలేం... శాంతి కావాలి.. కాశ్మీర్ అంశం పరిష్కరించుకుందాం: నవాజ్ షరీఫ్
పొరుగు దేశం భారత్‌తోనే కాకుండా మరో ఇతర దేశంతో తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అన్నారు. పార్లమెంటు సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాము యుద్ధాన్ని కోరుకోవడంలేదని,
పొరుగు దేశం భారత్‌తోనే కాకుండా మరో ఇతర దేశంతో తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అన్నారు. పార్లమెంటు సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాము యుద్ధాన్ని కోరుకోవడంలేదని, కానీ.. కాశ్మీర్ వివాదం పరిష్కారం కాకుండా శాంతి నెలకొనే అవకాశం లేదని పునరుద్ఘాటించారు.
యురీ ఉగ్రదాడిపై ఎలాంటి విచారణ చేపట్టకుండానే నిందలు పాకిస్థాన్‌పై మోపడం భావ్యం కాదన్నారు. పైగా.. అంతర్జాతీయ సరిహద్దును దాటి.. పీవోకేలోకి ప్రవేశించి భారత ఆర్మీ కాల్పులు జరపడం అనేది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించారు.
ఉకపోతే... పేదరికంపై పోరులో పోటీ పడదామంటూ భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సవాలుపై షరీఫ్ స్పందిస్తూ.. పంట పొలాల్లో యుద్ధ ట్యాంకులు తిరుగుతుంటే పేదరికంపై పోరాటం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఇక కాశ్మీరీల పోరాటానికి తమ మద్దతు కొనసాగుతుందన్నారు.