సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 మే 2020 (16:12 IST)

కరోనా మహమ్మారి... పాకిస్థాన్‌లో 50వేలను దాటిన కోవిడ్

కరోనా మహమ్మారి... పాకిస్థాన్‌ను గడగడలాడిస్తోంది. అసలే పేదరికంతో మగ్గుతున్న పాకిస్థాన్‌ను బెంబేలెత్తిస్తోంది. పాక్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50వేలను దాటడం అక్కడి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పటివరకు మొత్తం 50,694 మంది కరోనా బారిన పడ్డారు.

గత 24 గంటల్లో 2,603 మందికి వైరస్ సోకింది. ఇప్పటి వరకు 1,067 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు 15,201 మంది కోలుకున్నారని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. 
 
పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌(పీఐఏ)కు చెందిన ఈ విమానంలో మొత్తం 99 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో ఎంతమంది చనిపోయారనే విషయంలో కచ్చితమైన సమాచారం లేదు. అయితే, ఘటనాస్థలం నుంచి 57 మృతదేహాలను వెలికితీశామని అధికారులు తెలిపారు. బ్యాంక్‌ ఆఫ్‌ పంజాబ్‌ ప్రెసిడెంట్‌ జఫర్‌ మసూద్‌ సహా ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడిన సంగతి విదితమే.