మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 మే 2020 (16:49 IST)

పాకిస్థాన్‌లో ఇళ్లపై కూలిన విమానం : 107 మంది దుర్మరణం

పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 107 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. పాకిస్థాన్ ఇంటర్నేషన్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ)కు చెందిన ప్రయాణికుల విమానం ఒకటి కరాచీలో జిన్నా అంతర్జాతీయ విమానశ్రయం వద్ద ఎయిర్‌పోర్టుకు 4 కిలోమీటర్ల సమీపంలో కుప్పకూలిపోయింది. 
 
ఈ ఎయిర్ బస్ ఏ-320 విమానంలో ప్రమాదం జరిగిన సమయంలో 100 మంది ఉన్నట్టు భావిస్తున్నారు. వీరిలో ఎవరూ బతికే అవకాశాలు లేవని తెలుస్తోంది. విమానంలో ఉన్నవారిలో 100 మంది ప్రయాణికులతో పాటు.. విమాన సిబ్బంది ఏడుగురు ఉన్నారు. వీరంతా ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. 
 
ఈ విమానం జిన్నా విమానాశ్రయంలో దిగేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పి.. విమానాశ్రయం సమీపంలోని జిన్నా గార్డెన్ ఏరియాలోనే కుప్పకూలిపోయింది. 
 
సమాచారం తెలుసుకున్న పాక్ క్విక్ రియాక్షన్ బృందాలు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాలకు ఉపక్రమించాయి. కాగా, ఈ విమాన ప్రమాదం జనావాసాల్లో జరగడంతో అనేక గృహాలు కూడా ధ్వసంమయ్యాయి. అయితే, ఈ గృహాల్లోని ప్రజల సంగతి తెలియాల్సివుంది.