రెండవసారి కరోనా వైరస్ పాజిటివ్ వస్తే?

corona virus precautions
ఆర్. సందీప్| Last Modified శుక్రవారం, 22 మే 2020 (14:09 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో దాని నుండి బయటపడేందుకు పరిశోధనలు ముమ్మరంగానే జరుగుతున్నాయి. ఇప్పటికే లక్షల మంది దాని బారిన పడి ప్రాణాలు కోల్పోగా, దాని నుండి సురక్షితంగా బయటపడిన వారూ ఉన్నారు. అయితే కరోనా నుండి కోలుకున్న వారికి రెండో సారి మళ్లీ పాజిటివ్ వస్తే ఏమవుతుందనే సందేహం రానే వస్తోంది. అలాంటి దాఖలాలు కూడా ఉన్నాయి.

దక్షిణ కొరియాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ప్రివెన్షన్ చేసిన పరిశోధనలలో తేలిందేమంటే రెండోసారి కరోనా వస్తే భయపడాల్సిన పనిలేదు, వారి ద్వారా కరోనా వ్యాపించడం కూడా చాలా తక్కువ. వారు కోవిడ్ నుండి కోలుకున్న దాదాపు 400 మందిపై పరిశోధనలు చేయగా వారిలో 285 మంది మళ్లీ కోవిడ్ బారిన పడి ఉన్నారు.

అయితే వీరితో సన్నిహితంగా ఉన్న వారి పరిస్థితి గమనిస్తే, ఏ ఒక్కరికి కూడా కోవిడ్ ఉన్నట్లు తేలలేదు. కోలుకున్న వారిలో వైరస్‌ని ఎదుర్కొనే యాంటీబాడీలు సమృద్ధిగా ఉంటాయని, వారు భయపడాల్సిన పనిలేదని వారు చెప్పారు. రెండోసారి కరోనా వచ్చిన వారిని వైరస్ వ్యాప్తి కారకాలుగా పరిగణించడం లేదని దక్షిణ కొరియా అధికారులు వెల్లడించారు.దీనిపై మరింత చదవండి :