గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్
Last Modified: గురువారం, 21 మే 2020 (20:53 IST)

కరోనా క్వారంటైన్ సెంటర్‌లలోనూ మహిళలను వదలని కామాంధులు

ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ప్రజలు అల్లాడుతున్నారు. కరోనా సోకి హాస్పిటల్‌లలో క్వారంటైన్ కోసం చేరిన వారికి కామంతో కళ్లుమూసుకుపోయాయి. వివరాలలోకి వెళితే, మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో క్వారంటైన్‌ సెంటర్‌లో ఉన్న మహిళను కొంతమంది దుర్మార్గులు వేధింపులకు గురిచేసారు. కరోనా పాజిటివ్ రోగితో కాంటాక్ట్ నేపథ్యంలో కుమేరియా భటోలి గ్రామంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్‌లో అధికారులు ఓ మహిళను క్వారంటైన్‌లో ఉంచారు.
 
ఆమెపై కన్నేసిన ఇద్దరు కామాంధులు, ఆమె స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో చిత్రీకరించారు. ఆ వీడియోను చూపించి, సదరు మహిళను లైంగికంగా వేధించారు. అంతటితో ఆగకుండా, ఈ విషయాన్ని ఎవరితోనైనా చెబితే ఈ వీడియోని సామాజిక మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. సదరు మహిళ భయంతో పోలీసులను ఆశ్రయించింది. 
 
పోలీసులు ఇద్దరు నిందితులను గుర్తించారు, అయితే అప్పటికే ఆ కామాంధులు వారి వద్ద ఉన్న వీడియోను డిలీట్ చేయడంతో, పోలీసులు మహిళ దగ్గర ఉన్న వీడియో ఆధారంగా, బాధితురాలికి వారు పంపిన సందేశాల ఆధారంగా వారిని అరెస్ట్ చేసారు. క్వారంటైన్ సెంటర్‌లో సైతం మహిళను లైంగికంగా వేధించడం చర్చనీయాంశమైంది.