సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 19 మే 2020 (22:28 IST)

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఆహార పంపిణీ

సెయింట్ లూయిస్: అమెరికాలో కరోనా విలయ తాండవం చేస్తున్న ఈ సమయంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ పేదలకు సాయం చేయడంలో తన వంతు కృషి చేస్తోంది. ఈ క్రమంలో సెయింట్ లూయిస్‌లో నాట్స్ టీం... యూఎస్‌పీఎస్ చెస్టర్‌ఫీల్డ్‌‌కు చెందిన 40 మంది యూ.ఎస్.పి.ఎస్. పోస్టల్ ఉద్యోగులకు, ఇంతటి విపత్కర పరిస్థితులలో కూడా విధి నిర్వహణలో వారు చూపిస్తున్న దీక్షను ప్రశంసిస్తూ పిజ్జా లంచెస్ ఏర్పాటు చేసింది.
 
నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ సర్వీసెస్ కో-ఆర్డినేటర్ రమేశ్ బెల్లం, నాట్స్ సెయింట్ లూయిస్ విభాగం సమన్వయకర్త నాగ శ్రీనివాస్ శిష్ట్లా తో పాటు కమల్ జాగర్లమూడి, నరేశ్, శ్రీనివాస్ తదితరులు ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
నాట్స్ నాయకులు డాక్టర్ సుధీర్ అట్లూరి ఈ ఆహార పంపిణీ కార్యక్రమాలకు తనవంతు సాయం, మద్దతు అందిస్తున్నారు. కమల్ జాగర్లమూడి 1000 డాలర్లు, నరేశ్ 500 డాలర్లు విరాళంగా అందించారు. ఈ నెలాఖరులో సెయింట్ లూయిస్‌లో హోమ్‌లెస్ షెల్టర్స్‌లో ఉండే 400 మందికి ఆహారం అందించేందుకు నాట్స్ ఏర్పాట్లు చేస్తోంది.