సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 మే 2020 (19:54 IST)

పాకిస్థాన్ 48వేల మార్కును దాటిన కరోనా కేసులు.. 48మంది మృతి

ప్రపంచ దేశాలను కరోనా వణికిస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌లో లక్ష దాటిన కరోనా కేసులు.. పాకిస్థాన్‌లో 48వేల మార్కును దాటేసింది. గడిచిన 24 గంటల్లో పాకిస్థాన్‌లో 2193 కరోనా కేసులు నమోదైనాయి. ఫలితంగా కరోనా కేసుల సంఖ్య 48,091కి చేరుకుంది. 
 
అలాగే గడిచిన 24 గంటల్లో కరోనాతో 32 కరోనా మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 1,017కు చేరుకుంది. ఇప్పటి వరకూ 14 వేలకు పైగా కరోనా బాధితులు వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇక సింధ్ ప్రావిన్స్‌లో అత్యధికంగా దాదాసు 19 వేల కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో పంజాబ్ ప్రావిన్స్ నిలిచింది. అక్కడ 17382 కేసులు నమోదయ్యాయి. 
 
ఇదేవిధంగా పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో 1235 కేసులుండగా, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో 148 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా మొత్తం 4.3 లక్షల పరీక్షలు చేపట్టినట్టు పాక్ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.