1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 16 మార్చి 2017 (10:02 IST)

14 ఏళ్ల బాలుడిని రేప్ చేసింది.. ఆపై రెండుసార్లు కలిసింది.. గర్భవతి అయ్యింది..!

గర్భవతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదేంటి..? గర్భవతిపై కేసు నమోదు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది అనుకుంటున్నారు కదూ.. ఐతే చదవండి. బాలల హక్కులకు విరుద్ధంగా ఆమె గర్భవతి కావడమే ఇందుకు కారణమని పోలీసులు

గర్భవతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదేంటి..? గర్భవతిపై కేసు నమోదు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది అనుకుంటున్నారు కదూ.. ఐతే చదవండి. బాలల హక్కులకు విరుద్ధంగా ఆమె గర్భవతి కావడమే ఇందుకు కారణమని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మెకంజీ లీఫ్ గఫే అనే 19 ఏళ్ల వయసున్న గర్భవతి అయిన యువతి హాస్పిటల్‌కు వెళ్లింది. గర్భిణీలకు అక్కడి ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ‘మెడికేయిడ్’ అనే పథకంలో పేరు నమోదు చేయించుకుంది. 
 
అయితే భర్త వివరాలను రాసే చోట అతనికి 14 సంవత్సరాలని రాసింది.. భర్త వయసు చూసి ఖంగుతిన్న అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మెకంజీ లీఫ్ గఫే అనే భర్తగా పేర్కొన్న బాలుడిపై యువతి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. 
 
ఆపై కొన్నిసార్లు లైంగికంగా ఇద్దరూ కలవడంతో.. మెకంజీ గర్భవతి అయ్యిందని పోలీసులు తెలిపారు. అయితే 14 ఏళ్ల బాలుడిపై యువతి లైంగిక దాడికి పాల్పడటంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.