ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 7 నవంబరు 2020 (09:34 IST)

రష్యా అధ్యక్ష పదవికి పుతిన్‌ రాజీనామా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా తన పదవికి రాజీనామా చేయాలని పుతిన్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకు గల రెండు కారణాలు ప్రచారంలో ఉన్నాయి.

అరుదైన పార్కిన్సన్స్‌ అనే వ్యాధి కారణంగానే వచ్చే జనవరిలో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల విడుదలైన ఓ వీడియోలో పుతిన్‌ తరచూ తన కాలు అటూఇటూ కదుపుతున్నట్లు కనిపించింది. దీంతో ఆయన విపరీతమైన నొప్పి కారణంగానే కాలు కదుపుతున్నారని నిపుణులు పేర్కొన్నట్లు 'ది సన్‌' పేర్కొంది.

అంతే కాదు పుతిన్‌ ప్రియురాలు, మాజీ జిమ్నాస్ట్‌ అలినా కబేవా కూడా ఆయనను అధికార బాధ్యతల నుంచి తప్పుకోవాలని కోరుతున్నట్లు పేర్కొంది. ఈ వీడియోపై రకరకాల చర్చలు కొనసాగుతుండగానే పుతిన్‌కు పార్కిన్సన్స్‌ వ్యాధి లక్షణాలు ఉన్నాయంటూ మాస్కో పొలిటికల్‌ ప్రొఫెసర్‌ వాలెరీ సోలోవి పేర్కొంది.

దీంతో వివిధ పత్రికల్లోనూ, ప్రసార, సామాజిక మాధ్యమాల్లోనూ పుతిన్‌ రాజీనామాకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు పుతిన్‌ అనూహ్యంగా తీసుకొచ్చిన కొత్త చట్టం కూడా ఆయన రాజీనామా చర్చలకు మరింత బలాన్ని చూకూర్చుతోంది.

శాశ్వతంగా సెనేటర్‌గా ఉండేలా తీసుకొచ్చిన చట్టం ప్రకారం పుతిన్‌కు జీవిత కాలం పాటు దేశం నుంచి అన్ని అధికారిక సదుపాయాలు ఉంటాయి. రష్యాలో పుతిన్‌ ఇప్పటి వరకు దాదాపు 20 ఏళ్లపాటు అధ్యక్ష పదవిలో కొనసాగారు. కాగా రష్యాకు తానే శాశ్వత అధ్యక్షుడిగా కొనసాగేలా ఇటీవల రాజ్యాంగ సవరణకు పుతిన్‌ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.