''గుడ్ బై లిటిల్ గర్ల్, గుడ్ బై'' అనే పాట పాడుతూ గుండెపోటుతో మృతి చెందింది-దెయ్యంగా కనిపించింది..!
''గుడ్ బై లిటిల్ గర్ల్, గుడ్ బై'' అనే పాట ఆ గాయని ప్రాణం తీసింది. అమెరికాలోని మైనేలో బిడ్డేఫోర్డ్ సిటీ థియేటర్లో ఇవా గ్రే (33) 1904లో ఈ పాట పాడింది. ఈ పాట పాడిన కాలమో ఏమో కానీ ఆమెకు గుండెపోటు వచ్చింది
''గుడ్ బై లిటిల్ గర్ల్, గుడ్ బై'' అనే పాట ఆ గాయని ప్రాణం తీసింది. అమెరికాలోని మైనేలో బిడ్డేఫోర్డ్ సిటీ థియేటర్లో ఇవా గ్రే (33) 1904లో ఈ పాట పాడింది. ఈ పాట పాడిన కాలమో ఏమో కానీ ఆమెకు గుండెపోటు వచ్చింది. వెంటనే వేదికపైనే కుప్పకూలిపోయింది. వైద్యులు ఆమె చనిపోయిందంటూ నిర్ధారించారు. అయితే ఆమె ఆత్మ మాత్రం ఆ థియేటర్‌లోనే తిరుగుతుందని స్థానికులు అంటున్నారు.
అంతేగాకుండా థియేటర్లో ఉన్న ఆత్మను ఎలాగైనా బంధించాలని కెరోలినా నేతృత్వంలోని గోస్ట్ హంటర్లు సంకల్పించుకుని.. థియేటర్‌లో ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.45 వరకు థియేటర్ యాజమాన్యం నుంచి అనుమతి పొందారుచ
ఇలా గోస్ట్ హంటర్లు చేసిన ప్రయత్నం ఫలించింది. థియేటర్‌లో ఓ తెల్లని ఆకారం కెమెరాకు చిక్కింది. ‘సాయంత్రం గౌను’లో మెట్లపై నిలబడి బయటకు వెళ్లాలనుకుంటున్నట్టుగా ఉన్న ఈ తెల్లని ఆకారం అదే థియేటర్లో పాట పాడుతూ చనిపోయిన ఇవా గ్రే ఆత్మ అంటూ వారు చెప్తున్నారు. నాలుగేళ్ల పాటు జరిగిన ఈ పరిశోధనలో ఓ దెయ్యం మొత్తం శరీరం ఈ ఫోటోలో వచ్చిందని గోస్ట్ హంటర్లు అంటున్నారు.