గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 ఫిబ్రవరి 2022 (10:20 IST)

ఉక్రెయిన్‌పై ఐరాస భద్రతా చర్య.. వీటో చేసిన రష్యా

ఉక్రెయిన్‌పై ఐక్యరాజ్యసమితి భద్రతా చర్యను రష్యా వీటో చేసింది. రష్యా, మీరు ఈ తీర్మానాన్ని వీటో చేయవచ్చు, కానీ మీరు మా స్వరాలను వీటో చేయలేరు, మీరు సత్యాన్ని వీటో చేయలేరు అని అమెరికా రాయబారి చెప్పారు
 
ఉక్రెయిన్‌పై మాస్కో ఆక్రమణను ఖండించే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాన్ని రష్యా శుక్రవారం వీటో చేసింది. అయితే చైనా ఓటుకు దూరంగా ఉంది. ఈ చర్యను రష్యాను ఒంటరిని చేసిన చర్యల్లో పాశ్చాత్య దేశాల విజయగా భావిస్తున్నాయి.  
 
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, భారతదేశం కూడా అమెరికా రూపొందించిన తీర్మానం ఓటుకు దూరంగా ఉన్నాయి. మిగిలిన 11 మంది కౌన్సిల్ సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు.