బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 10 జనవరి 2017 (10:30 IST)

ఐసిస్ నుంచి ఒళ్లు జలదరించే వీడియో.. మాటలు సరిగ్గా పలకలేని బాలుడిని..?

ప్రపంచాన్ని వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టు సంస్థ ఆగడాలకు మితిమీరిపోతున్నాయి. బందీల పట్ల ఐసిస్ ఉగ్రవాదులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ఐసిస్ టెర్రరిస్టులు తలలు నరికి చంపుతూ ఆ వీడియోల‌ను పోస

ప్రపంచాన్ని వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టు సంస్థ ఆగడాలకు మితిమీరిపోతున్నాయి. బందీల పట్ల ఐసిస్ ఉగ్రవాదులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ఐసిస్ టెర్రరిస్టులు తలలు నరికి చంపుతూ ఆ వీడియోల‌ను పోస్టు చేసే సంగతి తెలిసిందే. ఐసిస్ తాజాగా ఒళ్లు జ‌ల‌ద‌రించే మ‌రో వీడియోను పోస్టు చేసింది. మాట‌లు కూడా సరిగా పలకలేని బాలుడితో బందీని చంపించింది. 
 
ఎర్ర‌గా ఉన్న ఓ చిన్నారి మొహంలో సీరియ‌స్‌నెస్ క‌నిపిస్తుండ‌గా న‌డిచి వ‌చ్చి ఎదురుగా ఉన్న బాల్‌పిట్‌లోకి దూరాడు. అక్క‌డ ఓ ఉగ్ర‌వాది ఇచ్చిన లోడ్ చేసిన గ‌న్‌ను చేతుల్లోకి తీసుకున్నాడు. దానిని ఎదురుగా ఫెన్సింగ్‌కు బంధించి ఉంచిన బందీపై గురిపెట్టాడు. వెంటనే ట్రిగ్గ‌ర్ నొక్కాడు. అంతే.. బందీ త‌ల‌లోంచి తూటా దూసుకుపోయింది. అత‌డు త‌ల‌వాల్చేశాడు. ఈ వీడియోను చూసిన ప్ర‌పంచం నివ్వెర‌పోయింది. ఈ వీడియో పట్ల నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. చిన్నారిని కూడా ఐసిస్ ఉగ్రవాదులు వదిలిపెట్టట్లేదని మండిపడుతున్నారు. 
 
ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ రాష్ట్రంలోనూ తన కార్యకలాపాల్ని విస్తరిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. క్రమంగా ఐసిస్ బలపడుతోందని, కేంద్రం రాఫ్ దళాల్ని కేటాయిస్తే దీన్ని పూర్తిగా అరికట్టగలుగుతామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు స్పష్టం చేశారు. వామపక్ష ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అదనంగా సిఆర్‌పిఎఫ్ బెటాలియన్‌ను కూడా రాష్ట్రానికి కేటాయించాలని కేంద్ర హోం మంత్రిని కోరారు. 
 
అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటయిన నక్సల్ నిరోధక గ్రేహౌండ్స్ మొత్తం దేశానికే నమూనా శక్తిగా మారిందన్నారు. గ్రేహౌండ్స్ దళాలకు అత్యాధునిక శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్రానికి 850 కోట్ల రూపాయలు కేటాయించాలని అలాగే రాజమండ్రిలో జాతీయ కారాగార అకాడమీని ఏర్పాటు చేయాలని రాజ్‌నాధ్‌ను చంద్రబాబు కోరారు.