సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 11 మే 2018 (12:11 IST)

విడాకులు ఇవ్వకుండా 11 మందితో పెళ్లి.. సోమాలియా మహిళను ఏం చేశారంటే?

ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 11 మంది వివాహం చేసుకున్న ఓ మహిళను సోమాలియాలో రాళ్లతో కొట్టి చంపారు. వివరాల్లోకి వెళితే... షుక్రి అబ్దుల్లాహీ వర్సెమ్‌ అనే మహిళ విడాకులు ఇవ్వకుండా 11 మందిని పెళ్లి చేసుకుం

ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 11 మంది వివాహం చేసుకున్న ఓ మహిళను సోమాలియాలో రాళ్లతో కొట్టి చంపారు. వివరాల్లోకి వెళితే... షుక్రి అబ్దుల్లాహీ వర్సెమ్‌ అనే మహిళ విడాకులు ఇవ్వకుండా 11 మందిని పెళ్లి చేసుకుంది. కానీ షరియా చట్టం ప్రకారం ఆమెను రాళ్లతో కొట్టి చంపాలని నిర్ణయించారు. అంతేగాకుండా దారుణంగా ఆమెను గొంతు వరకు భూమిలో పూడ్చి రాళ్లతో కొట్టి చంపేశారు. 
 
సోమాలియా రాజధాని మొగదిషుకు చుట్టు పక్కల ప్రాంతాల్లో తరచూ రైడ్స్‌ నిర్వహించే అల్‌ షబాబ్‌ మిలిటెంట్లు షుక్రిని పట్టుకున్నారు. విచారణలో మృతురాలికి 11 మంది భర్తలున్నట్లు తేలిందని అధికారులు తెలిపారు. కాగా షుక్రికి ఎనిమిది మంది సంతానం వున్నారు. 
 
ఇస్లామిక్ చట్టం ప్రకారం.. పురుషుడు నలుగురిని వివాహం చేసుకోవచ్చు. కానీ మహిళ ఒక వ్యక్తిని మించి వివాహం చేసుకోకూడదు. కానీ షుక్రి విడాకులు ఇవ్వకుండా 11 మందిని వివాహం పేరుతో మోసం చేసిందని కోర్టులో తేలడంతో ఆమెకు ఈ శిక్షను అమలు చేసినట్లు అధికారులు చెప్తున్నారు.