శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 1 ఆగస్టు 2017 (14:03 IST)

మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య: నిందితుడిని రోడ్డుపై అందరి ముందు కాల్చిపారేశారు..

మూడేళ్ల చిన్నారిని 41 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేసి కిరాతకంగా చంపేసిన ఘటన ఎమెన్‌లో చోటుచేసుకుంది. అయితే అతనికి కఠిన శిక్ష అమలు చేశారు. వివరాల్లోకి వెళితే.. మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన 41 ఏ

మూడేళ్ల చిన్నారిని 41 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేసి కిరాతకంగా చంపేసిన ఘటన ఎమెన్‌లో చోటుచేసుకుంది. అయితే అతనికి కఠిన శిక్ష అమలు చేశారు. వివరాల్లోకి వెళితే.. మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన 41 ఏళ్ల వ్యక్తి మొహ్మద్ అల్ మగరబిని ఎమెన్ రాజధాని సానాలోని ప్రధాన రోడ్డుపై పండుకుండబెట్టి.. రెండు చేతుల్ని వెనక్కి కట్టేశారు. ఆపై పోలీసులు వాడే ఏకే రకానికి చెందిన తుపాకీతో అతడిని కాల్చి పారేశారు. 
 
ముక్కుపచ్చలారని బాలిక పట్ల కిరాతకంగా వ్యవహరించిన 41 ఏళ్ల వ్యక్తిని వేలాది మంది ప్రజల మధ్య కఠినంగా శిక్షించారు. రోడ్డుపై  ప్రజలు చూస్తుండగా అతడిని కాల్చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం వైరల్ అయ్యింది. ఆ దేశ మీడియా ఈ ఘటనను హైలైట్ చేసింది. ఇంకా షరియా చట్టాన్ని ఎమెన్‌లో అమలు పరిచినట్లు మీడియా పేర్కొంది. షరియా చట్టం ప్రకారం హత్య చేసిన వ్యక్తికి మరణశిక్ష పడాల్సిందేనని ఎమెన్ మీడియా వెల్లడించింది.