బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 8 మే 2018 (15:20 IST)

కారును మింగేసిన అగ్నిపర్వత లావా... (amazing video)

హవాయి ద్వీపంలో కిలోయె అగ్నిపర్వతం బద్ధలైంది. ఈ అగ్నిపర్వతం నుంచి నిప్పులు చిమ్మింది. 300 అడుగుల ఎత్తుకు వెదజల్లుతున్న లావా ఇప్పటికే సమీప ప్రాంతాల్లోని అనేక ప్రాంతాలను నాశనం చేసింది. ఈ లావా ధాటికి అనే

హవాయి ద్వీపంలో కిలోయె అగ్నిపర్వతం బద్ధలైంది. ఈ అగ్నిపర్వతం నుంచి నిప్పులు చిమ్మింది. 300 అడుగుల ఎత్తుకు వెదజల్లుతున్న లావా ఇప్పటికే సమీప ప్రాంతాల్లోని అనేక ప్రాంతాలను నాశనం చేసింది. ఈ లావా ధాటికి అనే గృహాలు, పంట పొలాలు, చెట్లు ఇలా అన్నీ ఆహుతయ్యాయి.
 
తాజాగా హవాయిలోని పూనా నగరంలో ఎవరో వదిలేసి వెళ్లిన కారును లావా మింగేస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. మెల్లగా సమీపంలోని పంట పొలాల నుంచి రోడ్డుపైకి వచ్చిన లావా.. పక్కనే ఉన్న కారును తనలో కలిసేపుకుంటూ ముందుకెళ్లిపోయే వీడియో చూస్తే మన ఒళ్లు జలదరిస్తుంది. ఇదీ ఆ అద్భుతమైన వీడియోను మీరూ చూడండి.