ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 11 ఆగస్టు 2016 (15:02 IST)

మిస్డ్ కాల్ లవ్.. శీలాన్ని కోల్పోయిన యువతి.. ఎక్కడ..?

టెక్స్‌టైల్ షాపులో పనిచేస్తూ వచ్చిన శ్రీలంకకు చెందిన యువతి మిస్ట్ కాల్ ప్రేమతో శీలం కోల్పోయింది. షాపులో ఉండగా ఆ యువతికి తరచూ మిస్డ్ కాల్స్ వచ్చేవి. ఆ నెంబరుకు సదరు యువతి ఫోన్ చేసింది. ఆ వైపు నుంచి ఓ య

టెక్స్‌టైల్ షాపులో పనిచేస్తూ వచ్చిన శ్రీలంకకు చెందిన యువతి మిస్ట్ కాల్ ప్రేమతో శీలం కోల్పోయింది. షాపులో ఉండగా ఆ యువతికి తరచూ మిస్డ్ కాల్స్ వచ్చేవి. ఆ నెంబరుకు సదరు యువతి ఫోన్ చేసింది. ఆ వైపు నుంచి ఓ యువకుడు మాట్లాడాడు. ఈ మిస్డ్ కాల్ పరిచయం స్నేహంగా మారింది. స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఆ యువతి ఫోన్లో పూర్తి వివరాలు ఆ యువకుడిపై నమ్మకంతో చెప్పేసింది. 
 
కానీ ఆ యువకుడు మాత్రం తన వివరాలను ఆమెకు తెలియజేయలేదు. ఇలా ఓసారి ఇద్దరూ కలిశారు. ఆ సమయంలోనే ఆ యువతి తన శీలాన్ని కోల్పోయింది. ఆ తర్వాత ఆ యువకుడు చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయాడు. ఆపైనే తాను మోసపోయిన విషయాన్ని యువతి తెలుసుకుంది. ఇంతలో జరగాల్సిందంతా జరిగిపోయింది. తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.