Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేటు వయసులో తోడు లేకుండా కొండ చిలువ గుడ్లు పెట్టింది.. ఎలా?

Written By సెల్వి
Updated: శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (12:41 IST)
python
లేటు వయసులో అదీ తోడు కూడా లేకుండా ఓ కొండ చిలువ గుడ్లు పెట్టి రికార్డు సృష్టించింది. ఈ ఘటన మిస్సోరీలోని సెయింట్ లూయీస్ జూలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సాధారణంగా ఈ బాల్ పైథాన్‌లు 60 ఏళ్ల వయసులోనే పునరుత్పత్తి ఆపివేస్తాయి. అయితే తాజాగా 62 ఏళ్ల వయసులో ఈ కొండ చిలువ గుడ్లు పెట్టడం పై జూ అధికారులు పరిశోధనలు చేస్తున్నారు. మొత్తం ఏడూ గుడ్లు ఈ కొండచిలువ పెట్టింది.
 
వాటిలో రెండిటిని జెనిటిక్ శాంపిలింగ్ కోసం పంపించారు. వీటిని పరీక్షించడం ద్వారా గుడ్లు ఎలా పెట్టింది అనే విషయాన్ని తెలుసుకొనే అవకాశం కలుగుతుంది. నిజానికి పాములు చాలా వరకూ ఆలస్యంగా ఫలదీకరణం చెందడానికి వీలుగా కొంత వీర్యాన్ని తమలో నిలువ ఉంచుకుంటాయి. 
 
అయితే, దానిని కూడా అరవై ఏళ్ల వయసులోపులోనే ఫలదీకరిస్తాయని జూ హెర్పటాలజీ మేనేజర్ మార్క్ వానర్ తెలిపారు. ఇక ఇందులో రెండు గుడ్లు పనిచేయకుండా పోయాయి. మిగిలిన మూడు గుడ్లను పిల్లలను చేయడానికి ఇంక్యుబెటర్‌లో ఉంచారు.
 
ఆ కొండచిలువ వయసు 62 సంవత్సరాలు. 20 ఏళ్ల నుంచి ఆ కొండచిలువ ఒక్కటీ ఏ తోడూ లేకుండా ఉంటోంది. మగ కొండచిలువ లేకపోయినా ఈ కొండచిలువ గుడ్లు పెట్టడంతో జూ సిబ్బంది ఆశ్చర్యపోయారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments