ఆప్ఘన్ రాజకీయాల్లో వేలెట్టిన పాకిస్థాన్.. కాబూల్‌లో వ్యతిరేక ర్యాలీలు
తమ దేశాన్ని చక్కదిద్దుకోలేని పాకిస్థాన్ .. ఇపుడు ఆప్ఘనిస్థాన్ దేశ అంతర్గత వ్యవహారాల్లో వేలుపెట్టింది. దీనిపై ఆప్ఘన్ ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ పాకిస్థాన్ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం కాబూల్‌లో భారీ ప్రదర్శన జరిగింది. దీంతో నిరసన ప్రదర్శనకారులపై తాలిబన్ తీవ్రవాదులు కాల్పులు జరిపారు.
రాజధాని వేదికగా జరుగుతున్న ఈ యాంటీ-పాకిస్థాన్ ర్యాలీని చెదరగొట్టేందుకు తాలిబన్లు కాల్పులకు తెగబడ్డారు. దాపు 70 మంది ప్రదర్శనలో పాల్గొన్నారు. దాంట్లో ఎక్కువ శాతం మంది మహిళలే ఉండటం గమనార్హం. కాబూల్‌లో ఉన్న పాకిస్తానీ ఎంబసీ ముందు ఈ నిరసన ప్రదర్శన జరిగింది. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.