మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 ఆగస్టు 2021 (23:21 IST)

తాలిబన్లు మారరా..? స్వలింగ సంపర్కుడిపై గ్యాంగ్ రేప్

అమెరికా దళాలు తట్టాబుట్టా సర్దేశాయి. ఆప్ఘనిస్థాన్‌ను వీడాయి. దీంతో తాలిబన్ల అరాచకానికి హద్దు లేకుండా పోయింది. ఇప్పటివరకు మహిళల హక్కులపై ఉక్కుపాదం మోపుతున్న తాలిబన్లు.. ఇప్పుడు స్వలింగ సంపర్కులను వెంటాడుతున్నారు. 
 
తాజాగా దేశాన్ని విడిచి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ స్వలింగ సంపర్కుడిపై తాలిబన్లు దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా ఆ వ్యక్తిపై అత్యాచారానికి పాల్పడి తమ పైశాచికత్వాన్ని చాటుకున్నారు.
 
అప్ఘానిక్ చెందిన బాధిత స్వలింగ సంపర్కుడు ఇటీవల దేశం దాటి వెళ్లేందుకు ఒకరి సహాయం కోరారు. అయితే, తాను సంప్రదింపులు జరిపిన ఆ వ్యక్తి తాలిబన్ మనిషేనని తెలుకోలేకపోయాడు. 
 
ఈ క్రమంలోనే ఇద్దరు తాలిబన్లు ఆ స్వలింగసంపర్కుడిపై దాడికి చేసి రేప్ చేశారు. ఈ ఘటనతో అక్కడి స్వలింగ సంపర్కులు హడలెత్తిపోతున్నారు.