మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (19:43 IST)

అమెరికాలో బ్రెయిన్ స్ట్రోక్‌తో తెలంగాణ యువకుడి మృతి

brain
అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతున్న రుత్విక్ రాజన్ అనే తెలంగాణ యువకుడు బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ తిరుమలగిరికి చెందిన రిటైర్డ్ ఆర్టీఓ తులసీరాజన్ పెద్ద కుమారుడు బండ రుత్విక్ రాజన్ (30) ఉన్నత చదువుల కోసం రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. అతను ఇటీవల టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ పూర్తి చేశాడు. 
 
ఉద్యోగం కోసం ప్రయత్నించి స్నేహితులతో కలిసి భోజనం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. ఆదివారం రాత్రి మృతదేహం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోగా.. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.