శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 23 ఫిబ్రవరి 2017 (12:16 IST)

ట్రాన్స్‌జెండర్లకు సమాన హక్కులు.. బాత్రూమ్‌లు, లాకర్లు సేమ్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లింగ వివక్షకు వ్యతిరేకంగా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. వివాదాస్పద నిర్ణయాలతో జనాలకు దడ పుట్టిస్తున్న ట్రంప్ ట్రాన్స్‌జెండర్ల విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నారు. లింగ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లింగ వివక్షకు వ్యతిరేకంగా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. వివాదాస్పద నిర్ణయాలతో జనాలకు దడ పుట్టిస్తున్న ట్రంప్ ట్రాన్స్‌జెండర్ల  విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నారు. లింగ మార్పిడి చేయించుకున్న విద్యార్థులు వారికి మాత్రమే కేటాయించిన బాత్ రూమ్‌లు, లాకర్ రూమ్‌లను ఉపయోగించుకునే విధానానికి ఫుల్ స్టాప్ పెట్టారు. 
 
విద్యార్థుల్లాగానే ట్రాన్స్ జెండర్ విద్యార్థులకు కూడా బాత్ రూమ్‌లు, లాకర్ల విషయంలో సమాన హక్కులు ఉండాలని ట్రంప్ నిర్ణయించారు. గతంలో ట్రాన్స్ జెండర్స్‌కు ప్రత్యేక గదులు, లాకర్స్ ఉండేలా ఒబామా ప్రభుత్వం ఓ నిబంధనను తీసుకొచ్చింది. ఈ నిబంధనతో ట్రాన్స్ జెండర్లు, వారి కుటుంబీకులు ఎంతో ఆవేదన అనుభవించారు. కానీ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో లింగ మార్పిడి చేయించుకున్న విద్యార్థుల పట్ల సానుకూలంగా స్పందించింది.
 
ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేపట్టిన వివాదాస్పద వలస విధానాల ఫలితంగా 3 లక్షల మంది భారతీయ అమెరికన్లు అగ్రరాజ్యం నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరు సహా మొత్తం 1.1 కోట్ల మంది అనధికారిక వలసదారులు బహిష్కరణను ఎదుర్కొనే అవకాశముంది.