గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 22 జూన్ 2021 (12:29 IST)

కోవీషీల్డ్ వ్యాక్సిన్ పై యూఏఈ క్లారిటీ

ఇండియాలో సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న కోవీ షీల్డ్ వ్యాక్సిన్ ను అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆక్స్ఫర్డ్ - అస్త్రాజెనకా టీకాను ఇండియాలో సీరం ఇన్స్టిట్యూట్ కోవీ షీల్డ్ పేరిత ఉత్పత్తి చేస్తున్నది.

ఆక్స్ఫర్డ్ - అస్త్రాజెనకా టీకాను అనేక దేశాలు ఆమోదం తెలిపాయి . ఇందులో యూఏఈ కూడా ఉన్నది . 
 
భారతీయులు ఎక్కువగా ఉపాది కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు . ముఖ్యంగా యూఏఈకి వెళ్లే వ్యక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది . 
 
కోవీ షీల్డ్ తీసుకున్న భారతీయులు ఎలాంటి సందేహం అవసరం లేకుండా యూఏఈకి రావొచ్చని అధికారులు స్పష్టంచేశారు . 
 
ఆక్స్ఫర్డ్ టీకా యూఏఈలో ఆమోదం పొందిందని , దుబాయ్ కి వచ్చే వారికి మరో టీకా అవసరం లేదని అధికారులు తెలిపారు .