మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 31 మే 2021 (09:08 IST)

వ‌చ్చే నెల‌లో 10 కోట్ల కొవిషీల్డ్ వ్యాక్సిన్ల‌ ఉత్ప‌త్తి: సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్

వ్యాక్సిన్ల‌కు డిమాండ్ పెరిగిపోతున్న నేప‌థ్యంలో త‌మ సిబ్బంది 24 గంట‌లూ ఉత్ప‌త్తిని పెంచ‌డానికి ప‌ని చేస్తున్న‌ట్లు కేంద్ర‌ హోంమంత్రికి రాసిన లేఖ‌లో సీరం స్ప‌ష్టం చేసింది.

"జూన్ నెల‌లో 10 కోట్ల వ్యాక్సిన్లు త‌యారు చేస్తామ‌ని చెప్ప‌డానికి సంతోషిస్తున్నాం.మే నెల‌లో 6.5 కోట్లుగా ఉన్న ఉత్ప‌త్తిని ప‌ది కోట్ల‌కు పెంచ‌బోతున్నామ‌"ని ఆ లేఖ‌లో సీరం ప్ర‌భుత్వం, రెగ్యులేట‌రీ అఫైర్స్ డైరెక్ట‌ర్ ప్ర‌కాశ్ కుమార్ సింగ్ తెలిపారు.

నిజానికి జూన్‌లో 6.5 కోట్లు, జులైలో 7 కోట్లు, ఆగ‌స్ట్, సెప్టెంబ‌ర్‌ల‌లో ప‌ది కోట్ల చొప్పున వ్యాక్సిన్లు త‌యారు చేస్తామ‌ని ఈ నెల మొద‌ట్లో సీరం తెలిపింది.

అయితే తాజాగా జూన్‌లోనే కొవిషీల్డ్ ఉత్ప‌త్తి సామ‌ర్థ్యాన్ని 10 కోట్ల‌కు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం విశేషం. త‌మ‌కు అందుబాటులో ఉన్న అన్ని వ‌న‌రుల‌ను ఉప‌యోగించుకొని వ్యాక్సిన్ల ఉత్ప‌త్తిని పెంచుతున్న‌ట్లు లేఖ‌లో ప్ర‌కాశ్ కుమార్ చెప్పారు.