బుధవారం, 29 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Modified: బుధవారం, 19 మే 2021 (13:00 IST)

కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్‌ఎఫెక్ట్స్, లక్షణాలను విడుదల చేసిన కేంద్రం

Covishield vaccine: ఇండియాలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అనే అంశంపై కేంద్రం లక్షణాలను వివరిస్తూ ఓ లిస్ట్ రిలీజ్ చేసింది. అదేంటో, లక్షణాలేంటో తెలుసుకుందాం.
 
 కరోనాకి వ్యాక్సిన్ వేసుకుంటే తేడా కొడుతుందా అనే డౌట్ చాలా మందికి ఉంది. ముఖ్యంగా పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) తయారుచేస్తున్న... ఆక్స్‌ఫర్డ్-ఆస్త్రాజెనెకా సృష్టించిన... కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నవారికి విదేశాల్లో కొన్ని సైడ్ ఎఫెక్టులు కనిపిస్తుండటంతో... ఇండియాలో అలాంటి పరిస్థితి ఉందా అనే దానిపై కేంద్ర ఆరోగ్య శాఖ ఫోకస్ పెట్టింది. ఇండియాలో అలాంటి సైడ్ ఎఫెక్టులు చాలా తక్కువగానే వస్తున్నాయని తేల్చింది.

ఇండియాలో ప్రస్తుతం ఎక్కువగా ఉపయోగిస్తున్న వ్యాక్సిన్ ఇదే. దీన్ని వేసుకున్న వారికి సైడ్ ఎఫెక్టులు ఏ స్థాయిలో వస్తున్నాయో పరిశీలించమని కేంద్రం... యాడ్వెర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ (AEFI) అనే కమిటీని రంగంలోకి దింపింది. ఈ కమిటీ సభ్యులు... డేటాను సేకరించారు. ఓ రిపోర్ట్ తయారుచేసి కేంద్రానికి ఇచ్చారు. దాని ప్రకారం.. దేశంలో ప్రతి 10 లక్షల డోసుల్లో... 0.61 మందికి మాత్రమే... వ్యాక్సిన్ వేశాక... రక్తం గడ్డ కడుతున్నట్లు అవుతోందని తెలిపింది. అంటే... 20 లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఇలా అవుతోందని అనుకోవచ్చు.
 
ఇలా రక్తం గడ్డకట్టడాన్ని థ్రాంబోబోలిక్ (Thromboembolic events) ఈవెంట్స్ అంటారు. ఇందులో రక్తనాళంలో రక్తం గడ్డ కడుతుంది. ఒక రక్త నాళం నుంచి మరో రక్త నాళానికి రక్త సరఫరా ఆగిపోతుంది. ఇలా ఎవరికైనా అవుతుందేమో పరిశీలించమని కేంద్ర ఆరోగ్య శాఖ... హెల్త్ కేర్ వర్కర్లకు సూచన చేసింది. ఎలాంటి సైడ్ ఎఫెక్టులు రావొచ్చో... వ్యాక్సిన్ వేసుకున్నవారికి చెప్పి... వారిలో అవగాహన కలిగించమని తెలిపింది.

వ్యాక్సిన్ (ముఖ్యంగా కోవిషీల్డ్) వేసుకున్న తర్వాత 20 రోజుల్లో కొన్ని రకాల లక్షణాలు కనిపించే అవకాశం ఉంది అని తెలిపింది. ఇలాంటి లక్షణాలు ఎవరికైనా కనిపిస్తే... వారు ఎక్కడ వ్యాక్సిన్ వేయించుకున్నారో అక్కడ ఆ విషయం చెప్పేలా చెయ్యమని హెల్త్ కేర్ వర్కర్లకు కేంద్రం చెప్పింది.
 
మరి ఆ లక్షణాలు ఏంటో మనకూ తెలిస్తే... ఇక హెల్త్ కేర్ వర్కర్లు మనకు చెప్పాల్సిన అవసరం ఉండదు. అవి ఇవే అంటూ కేంద్ర ఆరోగ్య శాఖ వాటిని వివరించింది.
- ఊపిరి ఆడకపోవడం (breathlessness)
- రొమ్ములో నొప్పి (pain in chest)
- కాళ్లు, చేతుల్లో నొప్పి లేదా వాపు రావడం (pain in limbs/swelling in limbs)
- ఇంజెక్షన్ గుచ్చిన చోట ఎర్రగా కందిపోవడం లేదా... చర్మం కాలినట్లు అవ్వడం.
- కంటిన్యూగా కడుపులో నొప్పి (వాంతులు అవుతూ నొప్పి రావడం లేక అవ్వకుండా నొప్పి రావడం)
- మూర్ఛ రావడం. (వాంతులు అవుతూ రావడం లేక అవ్వకుండా రావడం)
- తీవ్రమైన తలనొప్పి (వాంతులు అవుతూ రావడం లేక అవ్వకుండా రావడం)
- నీరసం లేదా పక్షవాతం
- కారణం లేకుండా వాంతులు రావడం
- కళ్లు మసకబారడం, కళ్లలో నొప్పి, రెండేసి దృశ్యాలు కనిపించడం (having double vision)
- అయోమయంగా ఉండటం, ఒత్తిడితో అయోమయంగా ఉండటం.
- ఇవి కాకుండా ఇంకేమైనా అనారోగ్య సమస్యలు వస్తే... కూడా వ్యాక్సిన్ వేయించుకున్న చోటికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలి.
 
 
ఈ AEFI కమిటీ... దేశంలోని 498 సీరియస్ కేసుల్ని పరిశీలించింది. వాటిలో 26 కేసుల్లో మాత్రమే రక్తం గడ్డకట్టినట్లు అయ్యిందని చెప్పింది. సో... ఇప్పుడు మనకు ఆ సైడ్ ఎఫెక్టులేంటో అర్థమైపోయింది. మనకు గానీ, చుట్టుపక్కల ఎవరికైనా ఇలాంటి లక్షణాలు మనం చూస్తే... వెంటనే అలర్ట్ అవ్వొచ్చు, లేదా వారిని అలర్ట్ చెయ్యవచ్చు.