గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By ఎం
Last Modified: మంగళవారం, 18 మే 2021 (17:30 IST)

కోవిడ్-అనుబంధ మ్యూకోమైకోసిస్ (CAM) లేదా బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఏంటి?

బ్లాక్ ఫంగస్... మ్యుకోర్మైకోసిస్ అనేది అంటు వ్యాధి కాదు. ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం లేదు. మ్యూకోర్మైకోసిస్ రెండు రకాలుగా ఉంటుంది.
 
1. Rhino-Orbito-Cerebral Mucormycosis (ముక్కు, కన్ను, మెదడుకు సోకేది)
2. Pulmonary Mucormycosis (ఊపిరితిత్తులకు సోకేది)
ఇప్పుడు మనం చూస్తున్న అత్యధిక కేసులు ముక్కు, కన్ను, మెదడుకు సంబంధించినవి(ROCM).
కాబట్టి దీని గురించి వివరంగా తెలుసుకుందాం.
 
ఈ మ్యూకోర్మైకోసిస్‌ని ఎప్పుడు, ఎలా అనుమానించాలి?
ముక్కు దిబ్బడ వేయడం, ముక్కులోనుంచి నలుపు/ గోధుమ రంగు స్రావాలు రావడం, చెక్కిళ్ళ దగ్గర నొప్పి, తల నొప్పి, కంటి నొప్పి, కళ్ళు వాయడం, చూపు మందగించడం వంటివి ఉంటే దీనిని అనుమానించాలి.
 
ముకోర్మైకోసిస్‌ని ఎలా నిర్ధారణ చేస్తారు?
పైన చెప్పిన అనుమానిత లక్షణాలు ఉన్న వెంటనే అత్యవసరంగా మీ దగ్గరలోని చెవి, ముక్కు, గొంతు వైద్యున్ని సంప్రదించాలి. దీని నిర్ధారణ కోసం CT/MRI-PNS పరీక్ష చేస్తారు. ఊపిరితిత్తులలో కూడా ఉందో  లేదో తెలుసుకోవడానికి CT Chest చేస్తారు.
 
వైద్య చికిత్స:
వ్యాధి తీవ్రతను బట్టి మొదట 1-6 వారాల పాటు Liposomal Amphotericin Bతో చికిత్స చేస్తారు. తరువాత మరో 3-6నెలలపాటు Posaconazole మాత్రలు వాడవలసి ఉంటుంది. వ్యాధి మరీ తీవ్రంగా ఉంటే శస్త్ర చికిత్స ద్వారా ఫంగస్ సోకిన ప్రాంతాన్ని శుభ్రపరచడం, కళ్ళె తీసివేయడం వంటివి చేస్తారు.
 
ఈ వ్యాధి రాకుండా ఎలా నివారించవచ్చు?
1. షుగర్ అదుపులో ఉండేలా చూసుకోవాలి.  
2. ఆయాసం ఉంటేనే స్టెరాయిడ్స్ వాడాలి. అదికూడా వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలి. 
3. వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, గొట్టాలు ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి. 
4. బూజు ఉన్న గోడలకు దూరంగా ఉండాలి.

చివరిగా:
ఈ ముకోర్మైకోసిస్ కు ముందస్తుగా ఎటువంటి చికిత్స తీసుకోకూడదు. వ్యాధి వస్తేనే చికిత్స తీసుకోవాలి.