బ్లాక్ ఫంగస్‌తో కడపకు చెందిన వ్యక్తి మృతి
రాష్ట్రంలో కోవిడ్ వైరస్ మహమ్మారి విజృంభణతో ప్రజలు భయాందోళనకు గురవుతుంటే మరోవైపు బ్లాక్ ఫంగస్ హడలెత్తిస్తోంది. ఏపీలో అనేక మంది బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు.
తాజాగా కడప జిల్లాకు చెందిన వంశీ అనే వ్యక్తి బ్లాక్ ఫంగస్‌తో కాచిగూడలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో మృతి చెందాడు. ఏపీ వ్యాప్తంగా ఇప్పటివరకు 12 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది.
కొవిడ్ బాధితుల్లో ఎక్కువగా బ్లాక్ ఫంగస్ బయటపడుతోంది. ఎక్కువగా ఐసీయూలో ఉండడం, ఆక్సిజన్, స్టెరాయిడ్స్ వాడే వారిలో ఎక్కువగా బ్లాక్ ఫంగస్ బయటపడుతోందని వైద్యులు చెబుతున్నారు.