సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 డిశెంబరు 2022 (20:16 IST)

కెనడాలో మంచు తుపాను.. గుంటూరు దంపతుల మృతి

winter storm
అమెరికాతో పాటు కెనడాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తీవ్రమైన చలిగాలులతో ఇప్పటివరకు 60మంది మృతి చెందారు. తాజాగా మంచు తుఫానులో చిక్కుకుని ఏపీకి చెందిన దంపతులు మృతి చెందిన ఘటన న్యూజెర్సీలో జరిగింది. వీరు గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంకు చెందిన వారని గుర్తించారు. 
 
ఐస్ లేక్ దగ్గర ఫోటోలు దిగుతుండగా ఐస్ కుంగి మంచులో కూరుకుపోయారు దంపతులు. ఆ సమయంలో ఐస్ లేక్ ఒడ్డునే ఉండటంతో ప్రమాదం నుంచి పిల్లలు బయటపడ్డారు. హరిత మృతదేహాన్ని లేక్ నుంచి వెలికి తీశారు. కాగా అమెరికాలోని 20 కోట్ల మందిపై ఈ మంచు తుపాను ప్రభావం పడింది. 16 వేల విమానాలు రద్దయ్యాయి.