శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (09:12 IST)

ఉత్తర కొరియా తీరంలో అమెరికా బాంబర్లు, ఫైటర్ జెట్స్.. ఏ క్షణమైనా యుద్ధం?

ఉత్తర కొరియా తీరంలో అమెరికా బాంబర్లు, ఫైటర్ జెట్స్‌తో పాటు.. అత్యాధునిక యుద్ధ విమానాలను మొహరించింది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కనుసైగ చేస్తే చాలు.. ఉత్తర కొరియాపై అమెరికా సైన్యం భీకరదాడి చేసేందుకు సి

ఉత్తర కొరియా తీరంలో అమెరికా బాంబర్లు, ఫైటర్ జెట్స్‌తో పాటు.. అత్యాధునిక యుద్ధ విమానాలను మొహరించింది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కనుసైగ చేస్తే చాలు.. ఉత్తర కొరియాపై అమెరికా సైన్యం భీకరదాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. 
 
ఇటీవల ఉత్తర కొరియా అణు పరీక్ష నిర్వహించిన విషయం తెల్సిదే. ఈ పరీక్ష తర్వాత స్వల్ప భూకంపం నమోదు కావడం, మరో వారం వ్యవధిలో ఇంకో అణు పరీక్షకు ఆ దేశం సిద్ధమవుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. 
 
ఉత్తర కొరియా తీరంలో యూఎస్ ఎయిర్ ఫోర్స్ బీ-1బీ లాన్సర్ బాంబర్లు, ఫైటర్ జెట్ విమానాలను మోహరించింది. ఈ విమానాలు అంతర్జాతీయ జలాలపై విన్యాసాలు చేస్తూ, పెంటగాన్ సత్తాను చూపిస్తున్నాయి. 
 
అమెరికా ముందు సైనిక చర్యలు సహా చాలా ఆప్షన్స్ ఉన్నాయని ఉత్తర కొరియా ప్రభుత్వానికి వెల్లడించే ఉద్దేశంతోనే విమానాలను మోహరించి విన్యాసాలు జరుపుతున్నామని పెంటగాన్ ప్రతినిధి డనా వైట్ వెల్లడించారు. ఉత్తర కొరియా నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తూ, సమస్య తీవ్రతను పట్టించుకోవడం లేదని విమర్శించారు.