ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 మార్చి 2021 (13:18 IST)

మోదీ బంగ్లా పర్యటన.. అల్లర్లు.. షేక్ హసీనాకు కష్టకాలం

భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌లో రెండు రోజుల పర్యటన సందర్భంగా అల్లర్లు సృష్టించడంలో జమాతే ఇస్లామీ హస్తముందని ఇంటెలిజెన్స్‌ నివేదికలు చెప్తున్నాయి. భారత్‌లోని మైనార్టీలైన ముస్లింల పట్ల నరేంద్ర మోదీ క్రూరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు ప్రజలను ముఖ్యంగా యువతను ఆందోళన బాట పట్టించాయి.
 
మోదీ పర్యటనను అడ్డంగా పెట్టుకుని బంగ్లాదేశ్‌ ప్రధాని పీఠం పైనుంచి షేక్‌ హసీనాను దింపేయాలని అక్కడి ప్రతిపక్షాలు కుట్రపన్నాయి. ఈ సంగతులన్నీ ఇంటెలిజెన్స్‌ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. 
 
బంగ్లాదేశ్‌లో మోదీ రెండు రోజుల పర్యటన సందర్భంగా అక్కడ ఆందోళనలు చోటుచేసుకోవడం, వారిని అదుపుచేసే ప్రయత్నంలో కాల్పులు జరుపడంతో 12 మంది పౌరులు మృత్యువాత పడ్డారు. పెద్ద సంఖ్యలో యువకులు జైలుపాలయ్యారు.
 
మోదీ పర్యటన సందర్భంగా చెలరేగిన హింస నిరసనల కారణంగా లేదని, దాని కోసం కుట్ర జరిగిందని గూఢచార సంస్థలు పేర్కొన్నాయి. నిషేధిత సంస్థ జమాతే ఈ ఇస్లామీ హస్తం దీని వెనుక ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసే కుట్రలో భాగంగానే ఆందోళనలకు శ్రీకారం చుట్టినట్లు ఇంటెలిజెన్స్‌ నివేదికలు వెల్లడిస్తున్నాయి.