మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 19 జనవరి 2017 (11:55 IST)

20న శ్వేతభవనాధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణం... తొలి రోజున ఏం చేస్తారంటే...

అమెరికా కొత్త అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ శుక్రవారం (జనవరి 20వ తేదీ) ప్రమాణం చేయనున్నారు. ఈ వేడుకకు భారీ స్థాయిలో ఆయన మద్దతుదారులు హాజరుకానున్నారు. మరోవైపు నిరసనకారులూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. డోనా

అమెరికా కొత్త అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ శుక్రవారం (జనవరి 20వ తేదీ) ప్రమాణం చేయనున్నారు. ఈ వేడుకకు భారీ స్థాయిలో ఆయన మద్దతుదారులు హాజరుకానున్నారు. మరోవైపు నిరసనకారులూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. డోనాల్డ్ ట్రంప్ తన ప్రమాణానికి ముందు.. ప్రమాణం తర్వాత చేయనున్న కార్యక్రమాలను శ్వేతసౌథం వెల్లడించింది. వాటిని ఓసారి పరిశీలిస్తే.. 
 
* జనవరి 20: సెయింట్‌ జాన్స్‌ ఎపిస్కోపల్‌ చర్చిలో ఉదయం (స్థానిక కాలమానం ప్రకారం) జరిగే ప్రార్థనల్లో ట్రంప్‌ పాలుపంచుకుంటారు. అనంతరం దిగిపోనున్న అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కాపిటల్‌ భవనానికి ఊరేగింపుగా వెళ్తారు. 
* ఉదయం 9.30: ప్రముఖ గాయని జాకీ ఇవాంచో జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. అనంతరం మార్మన్‌ టేబెర్నాకిల్‌ గాయక బృందం సంగీత ప్రదర్శన, మతబోధకుల ఉపన్యాసాలు ఉంటాయి. డెమోక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌, మాజీ అధ్యక్షులు బిల్‌ క్లింటన్‌, జార్జ్‌ డబ్ల్యూ.బుష్‌, జిమ్మీ కార్టర్‌లూ ఈ కార్యక్రమాలకు హాజరవుతారు. 
 
* మధ్యాహ్నం 12: ట్రంప్‌తో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌ ప్రమాణం చేయిస్తారు. అనంతరం అధ్యక్షుడిగా ట్రంప్‌ తొలి ప్రసంగమిస్తారు. ఉపాధ్యక్షుడిగా మైక్‌పెన్స్‌ ప్రమాణం చేస్తారు. 
* కాపిటల్‌ భవనంలోని స్టాచ్యువరీ హాల్‌లో అధికారిక విందు 
* 3 గంటలకు: అధ్యక్ష ప్రమాణ స్వీకార కవాతు పెన్సిల్వేనియా ఎవెన్యూ మార్గం గుండా శ్వేతసౌథానికి వెళ్తుంది. 
* సతీమణి మెలానియాతో కలిసి మూడు అధికారిక విందుల్లో ట్రంప్‌ పాల్గొంటారు.  
* 3,000 మంది పోలీసులు, 7,000 మంది జాతీయ భద్రతా బలగాలు కవాతు మార్గం పరిసరాల్లో మోహరిస్తాయి. ఈ సందర్భంగా డోనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆందోళనకారులు అమెరికా రోడ్లు, వీధుల్లో నిరసనలు తెలిపేందుకు భారీ సంఖ్యలో సిద్ధమవుతున్నారు.