శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 21 ఆగస్టు 2021 (07:53 IST)

తాలిబన్‌ చీఫ్‌ ఎక్కడ..? పాకిస్తాన్‌ లోనా??

తాలిబన్ ప్రధాన నేత హైబతుల్లా అఖుంద్‌జాదా ఎక్కడున్నాడనే దానిపై ఇప్పుడు పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ఓ సీనియర్‌ ప్రభుత్వ అధికారి ఇప్పుడు అతడు పాకిస్తాన్‌ ఆర్మీ కస్టడీలో ఉండవచ్చునని చెప్పారు.

అయితే గత ఆరు నెలలుగా అతడిని తాలిబన్‌ సీనియర్‌ నాయకులు, ఆఫ్గాన్‌లో హింసాత్మక చర్యలు చేపడుతున్న తాలిబన్లు కూడా చూడలేదు. అతని చివరి బహిరంగ ప్రకటన మేలో రంజాన్‌ సందర్భంగా వచ్చింది. కాగా, పాకిస్తాన్‌ చెరలో ఉండటంపై ఆ దేశం ఎలా స్పందిస్తుందో అన్న విషయంపై భారత్‌ ఆసక్తి కనబరుస్తుంది.

మాజీ తాలిబ్‌ నేత అక్తర్‌ మన్సూర్‌ 2016లో అమెరికా డ్రోన్ల దాడిలో మరణించి తర్వాత హైబతుల్లా అఖుంద్‌ జాదా తాలిబన్‌ చీఫ్‌గా నియమితులయ్యారు.

తాలిబన్ల బృందంలో హైబతుల్లా కేవలం సైనికుడే కాకుండా రాజకీయ,మిలటరీ, న్యాయపరమైన అంశాల్లో మంచి పట్టున్న వ్యక్తిగా అభివర్ణిస్తారు. అయితే పూర్తిగా ఆఫ్గాన్‌ తాలిబన్ల చేతికి వచ్చాకే ఆయన అధికార పగ్గాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.