ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 11 జులై 2018 (16:39 IST)

ప్రపంచ జనాభా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం అధిక జనాభా?

రోజురోజుకు పెరుగిపోతున్న జనాభా తద్వారా తలెత్తే దుష్పరిణామాలను వివరించేందుకు, సమస్యలపై అవగాహన కలిగించేందుకు జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదల, తగ్గ

రోజురోజుకు పెరుగిపోతున్న జనాభా తద్వారా తలెత్తే దుష్పరిణామాలను వివరించేందుకు, సమస్యలపై అవగాహన కలిగించేందుకు జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదల, తగ్గుదలకు సంబంధించిన విషయాలపై ప్రజలలో చైతన్యం కలిగించడానికి ఐక్యరాజ్యసమితి 1989లో దీనిని ప్రారంభించింది.
 
జూలై 11న జన్మించిన ఒక శిశువుతో ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరింది. ప్రపంచ జనాభాలో 40 శాతం మూడవ ప్రపంచ దేశాలైన ఇండియా, చైనాలలోనే ఎక్కువగా ఉన్నారు. జనాభా సంఖ్య ప్రతి సంవత్సరం 9 కోట్ల 20 లక్షలు అదనంగా పెరిగిపోతుంది. గణంకాల ప్రకారం ప్రసవ సమయంలో ప్రతిరోజూ 800 మంది తల్లులు మరణిస్తున్నారు.
 
ప్రస్తుతం భారతదేశ జనాభా 135.41 కోట్లుగా ఉంది. మెుత్తం ప్రపంచ జనాభాలో మన దేశ జనాభా 17.7%. చైనా తరువాత రెండవ అత్యధిక జనాభా కలిగినది భారతదేశమే. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ఇండియా జనాభా సంఖ్య  135.43 కోట్లు. దేశంలో జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 455. ఇదే రీతిన జనాభా కొనసాగితే దేశంలో వనరులపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది.